ప్రకృతి సోయగం --దొడ్డపనేని శ్రీ విద్య

ప్రకృతి సోయగం --దొడ్డపనేని శ్రీ విద్య

ప్రకృతి సోయగం

కారు మబ్బులు కమ్ముకొనగా
చల్లటి వాన చినుకులు కురియగా
నేల తల్లి ఒళ్ళు విరిచి పరవశించగా

వాగు వంకలు పరవళ్ళు త్రొక్కగా
పచ్చని పైర్లు ఉయ్యాలలూగగా
కోయిల వసంతరాగం కూయగా

అలసిన మనసు సేద తీరగా
పారేటి సెలయేరులు జాలువారగా
నాట్యమయూరం పురివిప్పి కనువిందు చేయగా

సుగంధ పరిమళ పుష్పాలు విప్పారగా
ప్రకృతి తన్మయత్వం తో హొయలుపోగా
నయనానందకరంగా రమణీయ చిత్రాలు చిత్రించిన వేళ 

స్వర్గ దారులు తెరిచినట్లు అగుపించగా
పుడమి తల్లి పరవశించిగా
 కవి హృదయాలు సైతం మాటలు కందని మైమరుపుతో...

చిత్రకారుడు హాయి గొల్పు కమనీయ చిత్రాలను  చిత్రించిన అందాలతో....
ఎన్నో వసంతాల నిరీక్షణ ఫలించిగా...
అమూల్యమైన అద్భుత దివ్య కాంతుల ప్రకృతి సోయగం కనువిందు చేస్తుంటే....

చూడ చక్కని ధరణి అందాలకు 
*తుది శ్వాస వరకూ  బానిసలమే కదా*

--దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ


0/Post a Comment/Comments