నిదురించే తోటలోకి ...సయ్యద్ జహీర్ అహ్మద్

నిదురించే తోటలోకి ...సయ్యద్ జహీర్ అహ్మద్

నిదురించే తోటలోకి

తెలుగు సాహిత్య వినీలాకాశంలో చుక్కానిలా సుపరిచితం!

సంస్కృతాంధ్ర భాషల్లో బహుముఖం
వచన పద్యం రచనలలో
తత్సమాన ప్రతిభాపొటవం!

ఆధునిక కవిత్వంలో విలక్షణ ముద్ర
ఊహాజనిత ప్రాముఖ్యత
బహిరంతర ప్రకృతులకు వ్యాఖ్యాన దార్శనీకత!!

కాలరేఖ' కు పట్టం కట్టించిన
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత
బహుముఖ ప్రజ్ఞాశాలి
అలంకార శాస్త్రాలను ఔపోసించిన సృజనకర్త!
అన్నింటా సంప్రదాయ ఆధునిక తత్వాలు మేళవింపు
'సర్వే జనా సుఖినోభవంతు' అతని ఆత్మఘోష...
ఆత్మీయులకు అభిమానులకు 'శేషన్' 'శేషేంద్ర'!
రాష్ట్రీయ సంస్కృత ఏక్తా పురస్కారం పలు పురస్కారాలు అతని స్వంతం!

ఒకే ఒక్క పాటతో నిదురించే తోటలోకి
ఆహ్వానం పలికి కొత్త భాష్యం పలికిన కవి

సోహ్రాబ్-రుస్తుం అను పారశీక రచనకు తెలుగు సేత
శేష జ్యోత్స్న, మండే సూర్యుడు, రక్తం రేఖ,  నా దేశం-నా ప్రజలు, నీరైపోయింది, గొరిల్లా, నరుడు-నక్షత్రాలు కలం స్వారీ చేసిన ఘనత వెరసి
గుంటూరు శేషేంద్ర శర్మ ఉదకమండలంలో
ఉద్భవించిన కవీంద్ర!

--సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు.

0/Post a Comment/Comments