*తానైనా సరే చూడు*
*తనవారైనా చూడు*
*ఎవరికి వారె తోడు*
*ఇంకెవరు రారు జోడు*
*అయ్యయ్యో మనిషి జన్మ*
*మార్గం తెలియకనే ముగుస్తుంది*
*కాలము కరగుతుంది*
*యవ్వనం జరుగుతుంది*
*వయసు పెరుగుతుంది*
*మనసు తరుగుతుంది*
*అయ్యయ్యో మనిషి జన్మ*
*మార్గం తెలయకనే ముగుస్తుంది*
*ఉడుకు ఉడుకుది వండేను*
*తడికేసుకుని తినేను*
*పడకేసుకుని పండేను*
*వృధాగ అలా గడిపేను*
*అయ్యయ్యో మనిషి జన్మ*
*మార్గం తెలియకనే ముగుస్తుంది*
*వైరాగ్యపు వేధన*
*వియోగపు రోధన*
*విచారపు శోధన*
*వినిపించని ఖేధన*
*అయ్యో మానవ జనమ*
*మత్తులోనే ముగుస్తుంది కదా*
*ఎంతగా చెప్పిన వినడు*
*తనకు తానుగా కనడు*
*దండి పట్టుగాడు వీడు*
*మొండి బెట్టుగాడు చూడు*
*అయ్యయ్యో ఈ జన్మము*
*ఉత్తిగానే గడిచిపోతుంది కదా*
*నకరాలుగుడ నేర్చిండు*
*బకరాలను జేత్తుండు*
*చక్రములు తిప్పుతుండు*
*వక్రముగ నడుస్తుండు*
*అయ్యో మానవ జనమ*
*మత్తులోనే ముగుస్తుంది కదా*
*ప్రేమలో పొంగేరు*
*మోహములో కుంగేరు*
*సంఘములో వంగేరు*
*బతుకంతా కృంగేరు*
*అయ్యయ్యో మనిషి జన్మ*
*మార్గం తెలియకనే ముగుస్తుంది*
*ధర్మ మార్గము తెలియదు*
*కర్మ ఫలము సరిజేయరు*
*వర్మము చేబట్టరాదు*
*మర్మమెరిగి నడువరు*
*అయ్యయ్యో మనిషి జన్మ*
*మార్గం తెలియకనే ముగుస్తుంది*
*మనిషి జన్మ మళ్ల లేదు*
*తరిగి పోతె తిరిగి రాదు*
*చిరిగేది తనకు తెలియదు*
*ఒరిగేది కూడా తెలియదు*
*అయ్యయ్యో ఈ జన్మము*
*ఉత్తిగానే గడిచిపోతుంది*
*అంతా తనకు తెలుసే*
*అనుకుంటాడు మనిషి*
*తలచిందంతా ఊసే*
*తదనంతరం మనిషి*
*అయ్యయ్యో ఈ జన్మము*
*ఉత్తిగానే గడిచిపోతుంది కదా*
_________________________________
కవిమిత్ర పురస్కార
*బెజ్జారపు కళ్యాణాచార్యులు. కోరుట్ల*