కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

ప్రతిపక్షి ఒక ప్రత్యక్ష సాక్షి ?

ఏమిటీ?
ఏమిటీ ఈ దారుణం ?
ఎందుకింత కౄరత్వం ?
ఎక్కడుంది మానవత్వం ?
ఏది రామరాజ్యం ?
ఎటుపోతోంది నా దేశం ?
ఏమైపోయింది ప్రజాస్వామ్యం...?

నా దేశంలో
పారేది జీవనదులు కాదా... ?
అమాయకపు ప్రజల రక్తపుటేరులా...?
అత్యాధునిక ఆయుధాలు
అధికారాలు చేతిలో ఉన్నాయని
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?
ప్రజలు హక్కులను కాలరాస్తారా?
స్వేచ్ఛస్వాతంత్యాలను హరిస్తారా?

కౄరమైన తోడేళ్ళు పులులు
సింహాలు అడవిలో చొరబడి
విచ్చలవిడిగా వీరవిహారం చేసి
ఆకులుమేసే అమాయకపుమేకల్ని
హాయిగా స్వేచ్ఛగా విహరించే
బెదురుచూపుల జింకల్ని
వేటాడివేటాడి వేధించినట్లు
చీల్చి చెండాడి చంపేసినట్లు

కళ్ళకు కనిపిస్తే చాలు
దేశద్రోహులుగా చిత్రిస్తూ
బూటకపు ఎన్కౌంటర్లపేర
అన్నల్నిపొట్టన పెట్టుకుంటున్నారే
పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారే
ఏమిటి ఈ దారుణం ?
ఎందుకింత కౄరత్వం ?
ఎక్కడుంది మానవత్వం ?
ఏది రామరాజ్యం ?
ఎటుపోతోంది నా దేశం ?
ఏమైపోయింది ప్రజాస్వామ్యం...?

అదిగో అక్కడ ప్రజాస్వామ్యం
చెట్లకొమ్మలకు
గబ్బిలంలా వ్రేలాడుతోంది
అదిగో అక్కడ ప్రజలహక్కులు
వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి
అదిగో అక్కడ మానవత్వం
అధికారపు అగ్నిలో
చిక్కుకుని అల్లాడిపోతుంది
అదిగో అక్కడ
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు
ఎన్కౌంటర్ చేయబడ్డాయి

ఇందుకు
ఎందరో స్వేచ్ఛా జీవుల
అమాయకుల అభాగ్యుల
ఆత్మ బంధువుల ఎర్రని రక్తంతో
తడిసిన.............వేర్లు
గజగజ వణికిన...గాలి
రక్తపుటేరులు పారిన...నేల
ఆ అకృత్యాలను ఆకుల్లో దాచుకున్న
అడవిలోని...ప్రతి పచ్చనిచెట్టు
రెక్కలున్నా ఎగురలేక విలవిలలాడిపోతున్న
విలపిస్తున్న  ప్రతిపక్షి...ఒక ప్రత్యక్ష సాక్షి

(మహారాష్ట్ర లో 26 మంది మావోయిస్టుల
మారణకాండ వార్త చదివి చలించి కన్నీటితో వ్రాసిన కవిత)

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502


 

0/Post a Comment/Comments