మిత్రమా!!..సిద్ధమా?-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

మిత్రమా!!..సిద్ధమా?-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

మిత్రమా!!..సిద్ధమా?
---------------------------
ఆకాశానికి నిచ్చెన వేసి
మల్లెల్లాంటి చుక్కలన్నీ
మెల్లగా  కోసి తెద్దామా?
మాలగా దేవుని కెద్దామా?

నైతిక విలువలు నేర్చుకుని
సూర్యుని వోలె వెలిగిద్దామా?
చల్లని వెన్నెల కురిపించి
చల్లదనమును పంచేద్దామా?

తరువుల రీతి ఫలములిచ్చి
త్యాగగుణము చూపిద్దామా?
గురువుల చూపిన మార్గంలో
తారకల్లా మారుదామా?

మంచి పనులే మెండుగ చేసి
మహాత్మా గాంధీలవుదామా?
శివాజీ వోలె తెగువ చూపి
మహిని మగధీరలవుదామా?
---గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు

0/Post a Comment/Comments