చెట్టుపై చిలుకమ్మ-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చెట్టుపై చిలుకమ్మ-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చెట్టుపై చిలుకమ్మ
-------------------------------
చెట్టు మీద చిలుకమ్మ
పచ్చని చీర కట్టింది
కొమ్మకొమ్మకు తిరుగుతూ
కమ్మని పండు కొరికింది

అటూఇటూ చూసింది
తీయని పలుకులు చెప్పింది
తోటలో సందడి చేస్తూ
ఆనందంగా గడిపింది

పంజరంలో  బంధిస్తే
స్వేచ్ఛ అక్కడ లేదంది
ఆకాశంలో హాయిగా
రివ్వున ఎగిరి పోయింది
-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments