ఆదిశేషు అవతారం = దొడ్డపనేని శ్రీ విద్య

ఆదిశేషు అవతారం = దొడ్డపనేని శ్రీ విద్య

ఆది శేషు అవతారం
నాగుల చవితి


పుట్టలో కాల నాగన్న ఆశీర్వదించేను
సర్వ నాగేంద్ర ఆది శేషు మోక్షానొసగేను

సర్వారిష్ట అవరోధాలను నివారించేను
అష్ట ఐశ్వర్య సంతానప్రాప్తిన నుగ్రహించేను

జీవన గమనంలో వెన్ను బాము వలే వెన్నంటి కాపాడేను
పరమ శివుని కంఠాభరణమై ఉండేను


భక్తితో కొలిచిన కొంగు బంగారమయ్యేను
ఆర్తితో పిలిచిన రక్షించి దీవించేను

నాగన్నకు పుట్టలో పోసిన పాలు
ఆ పుట్టించిన దేవునికి మన విన్నపాలు

ఉదయమునే దీప కాంత మేలుకొలుపులు
కార్తిక మాస పుణ్య శుభ ఘడియలు

ఇంటి ముంగిట రతనాల రంగవల్లులు
ప్రకృతి రమణీయ పచ్చని తోరణాలు

కరుణతో తొలగించేను మన పాపాలు
దయతో సవరించేను మన లోపాలు

మన ఇంట వెలిగేను సుఖమయ కాంతి దీపాలు
.................…..............................

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
08/11/2021

0/Post a Comment/Comments