చెన్నయ్య-చెట్టు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చెన్నయ్య-చెట్టు-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

చెన్నయ్య-చెట్టు
-------------------------------------
చెన్నయ్య పొలంలో
గట్టు ఒకటి ఉన్నది
గట్టు మీద అందమైన
పెద్ద చెట్టు  ఉన్నది

అలసిపోయి చెన్నయ్య
చెట్టు నీడ చేరాడు
చల్లని చెట్టు క్రింద
కునుకు  కాస్త తీశాడు

కాలమెంతో గడిచింది
చెట్టు వయసు మీరింది
పెద్ద గాలి వచ్చి చెట్టు
కుప్పకూలి పోయింది

చెన్నయ్య కన్నీరు
ఏరులై పారింది
చెట్టు మేలు తలచి తలచి
మనసు కుమిలి పోయింది

మనిషి కన్న మిన్న చెట్టు
నరకడం మానాలి
త్యాగానికి ప్రతీకలు
చెట్లను కాపాడాలి
--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments