తేనెటీగ-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

తేనెటీగ-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

" తేనెటీగ "
-----------------------------------
పూలతోటలోనికి
తేనెటీగ వచ్చింది
ఝంకారం చేస్తూ
అటూఇటూ తిరిగింది

పూవులను చూసింది
వాటిపైన వాలింది
ప్రేమగ ముద్దాడుతూ
మకరందం గ్రోలింది

కడుపు నిండా త్రాగింది
తృప్తినెంతో నొందింది
చెట్టుపైన చేరింది
తేనెతుట్టె పెట్టింది

తేనెనందు పోసింది
నిండుగా  నింపింది
మధురమైన తేనెను
మనుజులకిచ్చింది

స్వార్ధమే వద్దంది
దాతృత్వం ముద్దంది
పదిమందికి  ఇస్తే
పుణ్యమెంతో అంది


--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments