నవ దుర్గ శ్రీమతి సత్య మొం డ్రేటి

నవ దుర్గ శ్రీమతి సత్య మొం డ్రేటి


జయతి జయతి మాత
జయహో దుర్గ మాత
అశ్వయుజ మాసాన 
ఆహ్లాద వాతావరణాన
శరత్ కౌముది కిరణా న
 నవరాత్రులలో నగుమోము తో
జగదేక సుందరి వై....
ప్రధమ శైలపుత్రి వై
ద్వితీయ  బ్రహ్మచారిణి తృతీయచంద్రఘంట దేవి గా
చతుర్ధ కూష్మాండ దేవి వై
పంచమ స్కంధమాత్రే
షష్టి  కాత్యాయనివై
సప్తమ కాళరాత్రి దేవి గా
అష్టమ మహాగౌరి వై
నవమి సిద్ధిదాత్రి గా
నవశక్తులతో దుష్టసంహారణార్థం...
నవరాత్రులలో వేంచేసిన మహా దుర్గమ్మకు జయహో...
నవరాత్రి లో లోదుర్గామాతను ఆరాధించి మాతృ చరణ సాన్నిధ్యాన్ని పొందాలి
నియమనిష్టలతో తల్లిని ఉపాసించాలి..
ధ్యాన న్స్మరణ  పూజ  ఆరాధన వల్ల దేవి సర్వశుభాలను చేకూర్చుతుంది.....
జగతికి జనులకు జయం ఇస్తుంది....... మాతృ చరణాలను ఆశ్రయిద్దాము అంధకార దుర్గతిని పారద్రోలే దుర్గామాతను సేవిద్దాం.....
అమ్మకు నీరాజనాలు ఇద్దాం
జయహో దుర్గామాత.......
కరుణతో మమ్ము కాపాడు దేవి.....

శ్రీ మతి సత్య మొం డ్రేటి హైదరాబాద్
ప్రక్రియ వచనం
కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments