లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977 .

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977 .

లక్ష్మణ రేఖలు
-------------------
61). ఇల గురువే సమస్తం
       తెలుసుకో నీవు నేస్తం
       అందితే గురు హస్తం
        విజ్ఞానం తో జీవిస్తం!

62). వైద్యులకు కోవిడ్ పై శోధన పరిశోధన
రోగులకేమో దానిపై వేదన ఆవేదన
కరోనా విరుగుడు మందు మార్కెట్లోకి వస్తుందా
సరైనడోసిస్తే ఆకరోనా మహమ్మారి ఇక చస్తుందా!

63) రైతుల ఉద్యమం తాత్కాలికంగా ఆగింది
ప్రభుత్వానికి తగిన వెసలుబాటు దొరికింది
ఇక ఇచ్చిన హామీలను పాటించాలి
ఇది రైతు ప్రభుత్వం అని చాటించాలి!

64). అన్నదాతను నడిసంద్రంలో ముంచొద్దు
మన్నికైన మద్దతు ధర ప్రకటిస్తే ఇక ముద్దు
అప్పుడు అవుతుంది ఉద్యమం బంధు
అది అందరికీ మంచి పరిణామం విందు!

65) చదివే ప్రధానం అని భావించు
       ఆ దిశగా కదులుతూ జీవించు
     చదువులరాణి శ్రీవాణికి మొక్కు
     పదవుల బోణిపల్లకిని నీవెక్కు !
 
66). కారుణ్య గుణమును పెంచుకో
అరణ్యరోదనను వినిపించుకో
సహాయసహకారం వెంటనే అందించు
మదిలోని మానవతా దీపాన్ని వెలిగించు!

67). చదువు సంస్కారంకై బడికి మనం
పూజాపునస్కారాంకై గుడికి దినం
తప్పక వెళ్లాలన్నది మన పెద్దల
 మాట
చెప్పకనే చెబుతున్నాను నేను ఈ పూట !

68). చదువుల సిరియే మనకు ముఖ్యం
ఏ పదవిలో లేదు అలాంటి సౌఖ్యం
నిత్య చేయి చదువుల వ్యాసంగం
సత్యంతో సరిచేయి పదవుల పాసింగం!

69). కులం మతం మాటే వద్దు
      మోసం ద్వేషం ఆట ఇక రద్దు
     అసత్యం జోలికి ఇక పోవద్దు
     నిత్యం సత్యం పలికితే ముద్దు!

70). అభ్యాసం కూసువిద్య వచ్చేలా
సభ్య సమాజం మనల మెచ్చేలా
సత్యపథమందు మీరు చరించండి
సత్యసంధులై ఇలలో తరించండి !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments