లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్. 9491387977.

లక్ష్మణ రేఖలు
--------------------
71). గాల్లో మెడలు కట్టొద్దు
        ఊళ్లో గొడవలు పెట్టొద్దు
        గ్రామ సింహమును కొట్టొద్దు
        సంగ్రామానికి కాలు దువొద్దు!

72). పగ ప్రతీకారం అసలువద్దు
         ప్రేమ మమకారమే ముద్దు
        పేరాశలో నీవు పడి పోవద్దు
         అశకు ఉండాలిక ఓహద్దు !

73)) పాపం పుణ్యం రెండు కళ్ళు
వానివల్ల స్పందించును నీ వళ్ళు
అందుకే దర్శించేది గుడి గోపురాలు
పసందుగ హర్షించే మడికాపురాలు

  74).పంచభూతముల
 ఆరాధించు
 ప్రకృతి శక్తులు నిను దీవించు
మూగ జీవులను ప్రేమించు
ముక్తిని దేవుడు అందించు !

75). రోజుకో మాయాబజాలం
     పూటకో టక్కు టమారం
      రాష్ట్రంలోన జరుగుచున్నవి
      రాజధానిలోనపెరుగుచున్నవి

76). పబ్బుక్లబ్బులకు పోవద్దురా
        పబ్బు గబ్బులో పడవద్దురా
       ఈ అలవాటు ఇక మార్చుకో
       నీ ఆరోగ్యాన్ని ఇక కూర్చోకో !

77). పెరిగిన బరువును తగ్గించండి
      ఒరిగిన కొవ్వును కరిగించండి
       వ్యాయామం నిత్యం చేయండి
       కోవిడ్ కొరివిని తరిమేయండి!

78). అడవులను పెంచండి
       గొడవలను తగ్గించండి
       వనదీప్తినివెలిగించండి
       పవనవ్యాప్తి కలిగించండి!

79). కాలగమనం గమనించు
        తగ్గట్టుగా వ్యవహరించు
        కలగదులే నీకు ఏఇబ్బంది
         అప్పుడు అంతా పగడ్బందీ !

80). అప్పు చేసి పప్పు కూడు తినకు
తప్పుడు తోవలో నీవు చనకు
ఎప్పుడు తలవంచు దీవెనకు
తప్పదు ఆ చర్య సద్భావన కు!

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments