లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977.

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977.

లక్ష్మణ రేఖలు
---------------------
91). పోడు భూముల్లో పాగా
        దర్జాగా బినామీల దగా
       ఆవర్జా కు చిక్కని జాగ
        ప్రభుతా పట్టించుకోవేగ!

92). చీకటి వెలుగుల రంగేళి
        జీవితమే ఒక దీపావళి
        పాపం పుణ్యం పొంగలి
       సొక్కిసోలే వైకుంఠపాళీ

93). మత్తు విక్రయాల జోలికి వెళ్లకు
మత్తుపదార్థాల జోలె పట్టి అమ్మకు
మార్కెట్లో వాటిని అమ్మడం నేరం
 నీవు చూస్తావులే ఇక జైలుద్వారం!

94). ఆలయాలను సుందరీకరించు
    పర్యాటక ప్రాంతాలుగా మార్చు
     కలుగు కాలుష్యాన్ని తొలగించు
     వెలుగు ఖ్యాతిని ఇక కలిగించు

95) మక్కువతో మొక్కలను పెంచాలి
వృక్షాలై అవి ఎదిగేలా సంరక్షించాలి
పచ్చదనంతో వెలిగిపోవు ప్రకృతి అంతా
నిశ్చయంగా తొలగిపోవు కాలుష్యం చింత !

96). శ్రీ కృష్ణుడి గీతా ప్రవచనం
       లోకోత్తర ధీరదూర వచనం
       భగవద్గీత నిత్యనూతనం
      అత్యంత అధునాతనం !

97). తామరాకుపై నీరువలె
        తనువు చివరకు జారులె
        ముదిమి వచ్చి మూల్గులే
        మోకాళ్ళిక పచ్చి పల్గులె. !

98). ఊపిరి ఉన్నంతవరకే నిన్ను
       ఎవరైనా దరిచేరి పలకరించేది
      ఊపిరి పోయినంక వారంతా
      తర్పణం నీళ్లతో  చిలకరించేది!

99). ఎవరికివారే యమునాతీరే
       ఏమి మోహమిది ఎందుకురా
       మురిపించిన నీ కొడుకు తీరా
       ముఖాగ్నిని పెట్టి కాల్చునురా !

100). ఉత్తమ పురుషుల స్నేహం చేసిన
చిత్తము నలచును నమ్ముమురా
మత్తుడవై మరి మోహము చెందిన
మొత్తును యముడు సత్యమురా !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

          
     
.

0/Post a Comment/Comments