లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977.

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ .9491387977.

లక్ష్మణ రేఖలు
---------------------
31). సాంప్రదాయాన్ని పాటించు
సంస్కృతిని చాటించు
చిరంజీవుల దీవించు
అంతా మన వారని భావించు!

32). ఆలస్యం అమృతం అన్నారు
నిదానం ప్రధానం అని విన్నారు
ఎప్పుడు ఏది అవసరమో ఆలోచించు
అప్పుడు ఆదానిని నీవు ఆచరించు!

33) దేనికి పరిష్కారం లేదో
అది మన జీవన స్మరణం
దేనికి పరిష్కారం కలదో
అది మన గణ ఆభరణం!

34). భక్తి శక్తిచే విషం అమృతంగా మారవచ్చు
ముక్తి యుక్తి చే నేరుగా స్వర్గాన్ని చేరవచ్చు
భగవత్సంకల్పం వల్ల అనుకున్నది సాధిస్తాం
భక్తి సత్సంగం వల్ల కోరుకున్నది అందిస్తాం!

35). రూక ఉందని మీరు బాబు చేయకు
పది ఉన్నాయని పరువు తీయకు
గంధ ఉందని నింద వేయకు
వేయ్యిఉన్నాయని గొయ్యి తొవ్వకు

36) వచ్చేటప్పుడు ఏమి తేలేదు 
పోయేటప్పుడు ఏమి తీసుకుపోము
మన చావు పుట్టుకల మధ్యన మిగిలేది
మానవత్వం మంచితనం మాత్రమే 

37). సర్వ వేద స్వరూపం సత్యం
ఆ సత్యము వల్లనే మోక్ష ప్రాప్తం
నిత్యసత్యమే ఆ పరబ్రహ్మ పథం
ఐక్యమత్యమే మన శక్తి విధానం!

38). దరిద్రం అనేది మన పొట్ట లాంటిది
వద్దన్నా అది పెరుగుతూనే ఉంటుంది
ఐశ్వర్యం నెత్తిమీది జుట్టు లాంటిది
కావాలన్నా ఉండక ఊడిపోతుంది

39) ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రమాదకరం
     నిరోధించు వానిని నీవు వేగిరం
    ప్రజలకు ప్రబోధించు ప్రతినిత్యం
   వజ్ర సంకల్పంతో నీవు ఈ సత్యం

40). చేయకు నీచులకు ఉపకారం
        చేస్తే నీకే కలుగును అపకారం
       తెలుసుకొని చుట్టు నీ శ్రీకారం
       కలుసుకొని కట్టు ప్రేమ ప్రకారం

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments