లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ . 9491387977.

లక్ష్మణ రేఖలు. సహస్ర ముత్యాల హారాలు అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ . 9491387977.

లక్ష్మణ రేఖలు
----------------------
51) జననం ఓ సంపూర్ణ ఉదయం
మరణం అస్తవ్యస్త అస్తమయం జనన మరణాలు కలసిన కవలలు
జననం జీవితం ఇక కకావికలు !

52). శైశవదశబాల్యం అమూల్యం
కౌమారం బహు బలే సుకుమారం
నవయవ్వనం మన్మధ నయనం
వృద్ధాప్యం దైవతపో అధ్యయనం!

53). మద్యం కలిగించును మత్తు
      చిత్తై పోవును నీ భవిష్యత్తు
      గమనించి నడుచుకో సోదరా
      గతించి నువ్వు పోతే బాధరా !

54).పుట్టుట పొద్దుపొడుపు
      గిట్టుట ఒక ఆటవిడుపు
       పుట్టుట గిట్టుట దైవమాయ
      జీవితం గుట్టు ఇదే నయ !

55). అన్నదాతలను ఆశ్రయించు
నిత్యాన్నదానాన్ని నీవు పెంచు
జ్ఞానదీపాన్ని ఇక వెలిగించు
అజ్ఞాన తిమిరాన్ని తొలగించు !

56). సమాచార హక్కు చట్టం చదువు
దిట్టవై అందులో నీవు ఎదుగు
ప్రజల అప్పిల్లను పరిష్కరించు
కష్టసుఖాలను కోర్టులో ఆవిష్కరించు!

57.) చెడ్డ అలవాట్లను మానుకో ఓ మానవా
దొడ్డ  అలవాట్లను ఏలుకోమంటే వినవా
అభ్యాసం కూసు విద్య అన్నారులే పెద్దలు
అలాంటివే ఇవిమరి వినుకో ఈ సుద్దులు !

58). ఒమిక్రాన్ వైరస్ అలజడి ఉంది
అందులో చిక్కుకుని పడకు నీవు ఇబ్బంది
పెట్టుకోవద్దు నీ మనసులో రంది
పెట్టుకుంటే జీవితానికి ఉండదు పాడింది.!

59). కోవిడ్జా గ్రత్తలను పాటించు
ఒమిక్రాన్ వైరస్.కు తెర దించు
 మాస్కులను అందరికీ పంచు
 ఏరిస్కులేకుండా వారిని ఉంచు!

60). పరుల సొమ్మును ఎప్పుడు ఆశించకు
పరుష పదాలతో ఎవరిని నీవు దూషించకు
సరళ పదాలతో సంభాషించు
కరతాళధ్వనులతో సంతోషించు!

గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments