అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం..

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం..

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా నిర్వహిస్తారు. అలాగే మానవహక్కుల దినోత్సవం రోజున, పురస్కారాలు కూడా అందిస్తారు. ముఖ్యంగా అత్యున్నత నోబెల్ పురస్కారము అందుకున్న వారిని ఈ రోజే సత్కరిస్తారు. ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10వ తేదీన "విశ్వమానవ హక్కుల రోజు"గా ప్రకటించింది. దానిని"అంతర్జాతీయ మానవహక్కుల దినం"గా జరుపుకుంటాం. మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్ కూడా ఏర్పాటు చేయబడినది.
మానవ హక్కుల ఉద్యమం 1970లలో, ముఖ్యంగా పూర్వ మరియు పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో, ప్రధానంగా ఐక్యరాజ్యసమితి మరియు లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ఎన్నో దేశాలు దీనిని ప్రపంచ స్థాయిలో ఉన్నత చర్చనీయాంశంగా భావించడంతో ఈ ఉద్యమం త్వరితంగా ఒక సామాజిక కార్యశీలత మరియు రాజకీయశైలిగా రూపుదిద్దుకుంది. 21వ శతాబ్ద సమయానికి మానవ హక్కుల ఉద్యమం దానియొక్క అసలైన నిరంకుశ-వ్యతిరేక వాదం నుండి మానవత్వ వాదం మరియు తృతీయ ప్రపంచంలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధి వంటి ఎన్నో విషయాలకు విస్తరించిందని మెయ్న్ వాదించాడు.

మన భారతదేశంలో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993 రూపొందించిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చింది.
మానవ హక్కులు:
*జాతి, వర్ణ ,లింగ, కుల, మత, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏ విధమైన వివక్షతకు గురికాకుండా ఉండే హక్కు.
*చిత్రహింసలు, క్రూరత్వము నుండి రక్షణ పొందే హక్కు
*వెట్టిచాకిరీ, బానిసత్వము నుండి దురాచారాల నుండి రక్షణ పొందే హక్కు.
*సరైన కారణం లేకుండా నిర్బంధించబడకుండా ఉండే హక్కు.
*నేరస్తులుగా అనుమానిస్తున్న, నిందితులని తేలే వరకు నిరపరాధి వలే హక్కు.
*స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు.
*సురక్షిత ప్రాంతాల్లో ఏకాంతంగా జీవించే హక్కు.
*ఇవే కాక, జీవించే హక్కు, సామాజిక భద్రతా హక్కు, భావ స్వాతంత్రపు హక్కు, విద్యా హక్కు, పిల్లలను ఆదుకునే హక్కు, ప్రజాస్వామ్య హక్కు. కాపీరైట్ హక్కు, జాతీయత హక్కు. ఏ మతం అయినా స్వీకరించే హక్కు. వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి..
ఇవి ఉల్లంఘించిన బడినప్పుడు ప్రత్యేక కోర్టులను కమీషన్లను ఆశ్రయించవచ్చు.

ముఖ్యంగా పోలీసు అధికారులు ప్రజలతో వ్యవహరిస్తున్న తీరు కూడా రాజ్యాంగ హక్కే.కేవలం పాలకులను రక్షించడానికే తాము ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. పోలీస్ కస్టడీలో జరుగుతున్న మరణాల పట్ల,జాతీయ మానవ హక్కుల కమిషన్ చేసిన మార్గదర్శక సూత్రాలను పోలీసులు ఏమాత్రం పాటించడం లేదు. అక్రమ కేసులు, జైల్లో విచారణలు, శిక్ష పడిన ఖైదీలకు వర్తిస్తాయి.

నా ఉద్దేశ్యంలోమానవ హక్కుల ఉల్లంఘన ప్రతి చోట జరుగుతూనే ఉంది. అసలుకు మానవ హక్కుల కమిషన్ ఉన్నట్లు సామాన్య ప్రజలకుసైతం తెలియదు.దీని పైన అవగాహన కల్పించవలసిన బాధ్యత తెలిసిన ప్రతి ఒక్కరిపైన ముఖ్యంగా సమాచార రంగంలోనివారికి ఉన్నది. వీటి పైన అవగాహన సదస్సులు పెట్టి. ప్రజలను చైతన్యం చేయాలి.
వారికి జరిగిన అన్యాయాలను. మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజలు ముందుకు రావాలి. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే, ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.
నాయకులు కూడా ప్రజలకు దాని పైన అవగాహన కల్పించి, ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అప్పుడే ఈ మానవ హక్కుల దినోత్సవం విజయవంతం అయినట్లు.

కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235

0/Post a Comment/Comments