" పిల్లలం "-గద్వాల సోమన్న

" పిల్లలం "-గద్వాల సోమన్న

" పిల్లలం " (బాలగేయం)
---------------------------
అందాల బాలలం
మందార మాలలం
చందమామ రీతి
విందుజేయు బొమ్మలం

విలువైన పిల్లలం
కొలనులో కలువలం
కలతలకు దూరం
తెలుగులమ్మ బిడ్డలం

పువ్వు వంటి బాలలం
నవ్వు వోలె సొగసులం
దవ్వు మాకు చింతలు
దివ్వెలొసగు వెలుగులం

సన్నజాజి పూవులం
కన్నవారి ఆశలం
మిన్న మేం గుణంలో
వెన్న లాంటి మనసులం

-గద్వాల సోమన్న ,
9966414580.

0/Post a Comment/Comments