అందాల " హరివిల్లు "-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అందాల " హరివిల్లు "-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

అందాల " హరివిల్లు "
---------------------------------
అందమైన హరివిల్లు
ఆకసాన పుట్టిల్లు
అబ్బురమే హరివిల్లు
ఆనందాల సిరిజల్లు

రంగురంగుల హరివిల్లు
ఏడు రంగుల విరిజల్లు
ఎండ,వాన కలిసొస్తే !
అగుపించును హరివిల్లు

అందరు మెచ్చే హరివిల్లు
అపురూపం పొదరిల్లు
వంచిన అంబు రీతిలో
వర్ణశోభితం  హరివిల్లు

గగన వనమున హరివిల్లు
పూసిన పూవు హరివిల్లు
ముద్దులొలికే హరివిల్లు
బోసినవ్వుల హరివిల్లు

--గద్వాల సోమన్న  ,9966414580

0/Post a Comment/Comments