అనురాగ దేవత అమ్మ-గద్వాల సోమన్న

అనురాగ దేవత అమ్మ-గద్వాల సోమన్న

అనురాగ దేవత అమ్మ
--------------------------------
ఆణిముత్యం అమ్మ
ఇంటి దేవత అమ్మ
అనురాగమనె కొమ్మ
ఓ వెన్నెలమ్మ!

ప్రేమ శిఖరం తల్లి
పరిమళించే మల్లి
ఇంట ద్రాక్షావల్లి
ఓ వెన్నెలమ్మ!

గొప్పది మాతృమూర్తి
కుటుంబంలో కీర్తి
అందరికిచ్చును స్పూర్తి
ఓ వెన్నెలమ్మ!

అమ్మ గృహమున జ్యోతి
అనురాగాల గీతి
గౌరవించుట నీతి
ఓ వెన్నెలమ్మ!
-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments