భగవద్గీత...

భగవద్గీత...

           ••••• భగవద్గీత ••••••
కనుమరుగవుతున్న మనిషికి
మార్గదర్శి గీత
విలువలు వదిలిన మనిషికి
దిక్సూచి గీత
మారుతున్న సమాజానికి
నడక నేర్పే మాతృమూర్తి గీత
మనిషి ఎలా ఉండాలి 
ఎలా నడవాలనే
కర్తవ్యాన్ని, ధర్మాన్ని
తెలిపే జీవన గ్రంథం గీత
తినే తిండి నుండి గుణాల వరకు
తామస, రాజస ,సాత్విక 
త్రిగుణాల కలయికలతో నడిచే మనిషికి
జీవన గమనాన్ని
జీవిత సూత్రాన్ని
విశదీకరించే జ్ఞాన భాండాగారం
శ్రీమద్భగవద్గీత...
అలసిన మనసుకు ఆశ్వాసన్ని
పడిపోయిన మనిషి ధైర్యాన్ని
జడంగా ఉన్న మనిషిలో
చైతన్యాన్ని బోధించే పంచమ వేదం
శ్రీమద్భగవద్గీత...
తరాలు మారినా తరగని జ్ఞానం
యుగాలు గడిచిన మారని అక్షరం
ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు జ్ఞానామృతాన్ని
ఇచ్చే జ్ఞాన కల్పతరువు శ్రీమద్భగవద్గీత...
ప్రపంచ సాహిత్యమంతా మరుగునపడిన
నిరంతరం వెలుగును పంచే
తత్వజ్ఞానం శ్రీమద్భగవద్గీత...
అందుకే
నా భారతదేశ వారసత్వ సంపద
శ్రీమద్భగవద్గీత......
••••••••• శ్రీపాల్‌.బి ••••••••••















0/Post a Comment/Comments