వస్తావా!!వస్తావా?--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

వస్తావా!!వస్తావా?--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

వస్తావా!!వస్తావా?
--------------------------------
చీమా! చీమా!!వస్తావా?
చక్కర కొంత  తెస్తావా?
చక్కెర పొంగలి చేద్దాం!
చక్కగా మనం తిందాం!!

పుంజూ! పుంజూ!! లేస్తావా?
వేకువ జామున కూస్తావా ?
జగతిని నిదుర లేపుదాం!!
గడియారంగా మారుదాం!!

ఎద్దూ ! ఎద్దూ!! వస్తావా?
రైతుకు సాయం చేస్తావా?
పొలమును బాగా దున్నుదాం!
అన్నదాతకు అండుందాం !!

చిలుకా!చిలుకా!! వస్తావా?
తీయని పండు తెస్తావా?
సమాన భాగం చేద్దాం!
ఇద్దరూ కలిసి తిందాం!!
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments