కామారెడ్డి కవులకు సన్మానం

కామారెడ్డి కవులకు సన్మానం

జిల్లా కవులకు ఘనంగా రవీంద్రభారతి వేదికపై సన్మానం

17 డిసెంబర్ శుక్రవారం. 
అంతర్జాతీయ సాహిత్య సంస్థ అయిన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలో కామారెడ్డి జిల్లాకు చెందిన కవులు శ్రీశ్రీ కళావెదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జెట్టబోయిన శ్రీకాంత్ , గౌరవ అధ్యక్షులు చౌకీ రాజేంద్ర, చిందం సునీత, కళ్లెం నవీన్ రెడ్డి, కాలై కవితా సుభాష్, అయ్యవారు మురళి, గాండ్ల నర్సింలు, బట్టు నర్సింలు, ఎదురుగట్ల రజినీకాంత్, గడ్డం సంజీవులు, ఆరేకటికే  మోతీలాల్ లను శాలువా, పూలమాలలతో సన్మానం చేయడంతో పాటు జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ భాషా , సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీమతి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, శ్రీశ్రీ కళా వేదిక అధ్యక్షులుడా" కత్తిమండ ప్రతాప్, బోయి హైమావతి భీమన్న, గోరేటి వెంకన్న, జయరాజు, మురళి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత శ్రీనివాస్ వాసుదేవ్, కొల్లి రమావతి, చిట్టె లలిత, ఓ కోయిలా నవీన్, సంధ్య, సునీత   గార్లతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల నుండి మూడు వందలకు పైగా కవులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments