మాజీ సిబిఐ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా పోలయ్య కవికి ఘనసన్మానం

మాజీ సిబిఐ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా పోలయ్య కవికి ఘనసన్మానం

మాజీ సిబిఐ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ గారి
చేతుల మీదుగా పోలయ్య కవికి ఘనసన్మానం

హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు సైమన్ ఫౌండేషన్ మరియు ఎన్జీవోస్ నెట్వర్క్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 2021 జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ సభకు
కళారత్న శ్రీ బిక్కికృష్ణ అధ్యక్షత వహించారు

ఈ సభకు ముఖ్యఅతిథులుగా రిటైర్డ్ జడ్జి శ్రీ చంద్రకుమార్   మాజీ సి.బి.ఐ జేడీ శ్రీ లక్ష్మీనారాయణ  సైమన్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీమతి మనోరంజని  ఆరిగపూడి పూర్ణచందర్రావు ఫౌండేషన్ చైర్మన్ లయన్ శ్రీ విజయ్ కుమార్  తెరసం అధ్యక్షులు శ్రీ నాళేశ్వరం శంకరం  శ్రీ గోరేటి వెంకన్న ఇంకా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు

శ్రీమతి సుమన ప్రణవ్ రచించిన రెండు కవితా సంపుటాలను జేడీ లక్ష్మీనారాయణ గోరేటి వెంకన్నలు ఆవిష్కరించారు నాళేశ్వరం శంకరం క్లుప్త సౌందర్యంగా సమీక్ష చేశారు

దయార్ద్ర హృదయులైన దాతలందరిని ఒక వేదిక మీదికి చేర్చి సమాజానికి వారు చేసే నిస్వార్థ సేవలను కొనియాడి వారి చేతులమీదుగా ఏ గుర్తింపుకు నోచుకోని ఎందరో కవులను కళాకారులను సంఘసేవకులను ఘనంగా సన్మానించారు.

ఇందుకు ప్రధాన కారకులు ఇంత గొప్ప సాహితీసేవ చేస్తూ ఎందరినో వెలుగులోకి తెస్తున్న కళాపోషకులు కళారత్న బిక్కికృష్ణను ప్రముఖులందరు ప్రశంసలతో ముంచెత్తారు

తదనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కవి రచయిత
శ్రీ పోలయ్య కూకట్లపల్లి "ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అస్తమయం" ‌కవితను చదివి వినిపించారు సభను అలరించారు తన సాహితీ ప్రయాణంలో తాను130 కరోనా కవితలు1500 వచన కవితలు వ్రాసినట్టు అందులో
1300 పైగా కవితలు 40 పత్రికలలో ప్రచురితమైనట్టు
7 పుస్తకాలను ముద్రించినట్టు తెలిపారు

వీరు చేస్తున్న ఈ సాహితీసేవలకు గుర్తింపుగా 
జెడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా శాలువా
ప్రశంసాపత్రం  మెమొంటో  రెండు ఆవిష్కరణ
పుస్తకాలతో పోలయ్య కవిని ఘనంగా సన్మానించారు

ఈ సందర్భంగా తనకు జరిగిన సన్మానానికి తోటి కవిమిత్రులు అభినందించారు అందరికి ప్రత్యేకంగా
జేడీ లక్ష్మీనారాయణ కళారత్న బిక్కికృష్ణ గార్లకు
పోలయ్య కవి కృతజ్ఞతలు తెలియజేశారు 

0/Post a Comment/Comments