మనచుట్టు ఉన్న బంధాలు...ఎన్నో అద్భుతాలు

మనచుట్టు ఉన్న బంధాలు...ఎన్నో అద్భుతాలుమన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! కానీ  ఇది నిజం
ఒక్కసారి ఈ బంధాలు పరిశీలించి అవగాహన చేసుకోండి1. తల్లి* 

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  తల్లి మొదటి అద్భుతం. 
2. తండ్రి* 

మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు. మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు. దుఃఖాన్ని తాను అనుభవిస్తూ. సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. *3. తోడబుట్టిన వాళ్ళు* 

మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  
మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం

*4. స్నేహితులు*  

మన భావాలను పంచుకోడానికి..  
మంచి చెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు నాలుగో  అద్భుతం. 

 *🌷5. భార్య/భర్త* 

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది 
కలకాలం తోడు ఉంటూ... ఇన్ని రోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది 
భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .

 *6. పిల్లలు* 

మనలో స్వార్థం మొదలవుతుంది..  
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  
వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  
వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ ఉంటుంది.. 
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  
పిల్లలు ఆరో అద్భుతం 

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

🌷 *7. మనవళ్ళు* *మనవరాళ్లు* 

వీరి కోసం ఇంకా కొన్ని రోజులు బతకాలనే  ఆశపుడుతుంది.. 
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 
మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం  
వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 

ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  
చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  
అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...

ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి ఆయిగా జీవించడం లోనే ఆనందం.సంబంధాలన్ ఆర్దిక కోణం లో చూసి వాటికి మాధురత ను కోల్పోతున్నాం
    ఉమాశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments