ప్రతిపాట ఒక పంచామృతమే!
చల్లని పాటల...చంద్రుడు
ఇంపైన పాటల...ఇంద్రుడు
చురుకైన పాటల...సూర్యుడు
మత్తెక్కించే పాటల...మాంత్రికుడు
మన చిరునవ్వుల సిరివెన్నెల
సీతారామశాస్త్రి గారి
కలం నుండి గంగలా ఉప్పొంగి
శ్రోతల నెంతగానో అలరించిన
ఉత్తమ చిత్రాలుగా
అవార్డులు అందించిన
చిత్రనిర్మాతలకు కనకవర్షాన్ని
కురిపించిన కొన్ని
ఆణిముత్యాలు అమృత గుళికలు
జగమంత కుటుంబం
నాది ఏకాకి జీవితం నాది...
సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నావే...
ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చేవాడి నేమి అడిగేది?
ముక్కంటి ముక్కోపి
తిక్కశంకరుడు వాడినేమి కోరేది?...
ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి
ఎప్పుడూ ఒదులుకో వద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు ఏ నిర్ణయం
అప్పుడే జయం నీకు నిశ్చయం....
మారదు లోకం మారదు లోకం
దేవుడు దిగిరానియ్ ఎవ్వరు ఏమైపోనియ్
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితో కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని...
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో....
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషమూ నేను
నా గుండె ఏనాడో చెయ్ జారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనె ఏం మాయ చేస్తావో...
వేణు మాధవా....వేణు మాధవా....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నేలీనమై
ఆ మోవిపై నేమౌనమై నిను చేరనీ...
ఔను ఆ కవీశ్వరుని
ప్రతి పాటా ఒక పాఠమే
ప్రతి పాట ఒక అగ్నికెరటమే
ప్రతి పాట నవరస భరితమే
ప్రతి పాట ఒక ఆణిముత్యమే
ప్రతి పాట ఒక పంచామృతమే
ప్రతి పాట ఒక అనుభవసారమే
ప్రతి పాట ఒక ఉషోదయ కిరణమే
ప్రతి పాట చీకటిని చీల్చే ఓ సిరివెన్నెలే
ఆయన ప్రతి మాట ఒక పాటే
పాటే ప్రాణం ఆయన ఓ పాటల పుట్ట
ప్రముఖ కవి దిగ్గజాలను ఢీ కొట్టిన దిట్ట
ఆత్రేయ ఆరుద్ర దాశరథి
శ్రీ శ్రీ సినీ గేయ కవులకు ప్రతిరూపమే సిరివెన్నెల
వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని
కోరుకుంటూ అందిస్తున్న అక్షర నీరాజనం...
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502