మట్టిలో మాణిక్యమా జోహార్లు

మట్టిలో మాణిక్యమా జోహార్లు

మట్టిలో మాణిక్యమా  జోహార్లు

ఎందరో పుడతారు
కొందరే అవుతారు మహనీయులు, 
సమాజపు  సమస్యలు,
అవి భుజాన మోసే బోయీలెందరు?
అసమానతల సమాజం,
ఉన్నవాడు లేనివాన్ని 
ఎదగనివ్వడు ఏరంగంలోనూ,
నడిసంద్రంలో చిక్కిన నావవలె,
ఆటుపోట్లను ఎదుర్కొని, 
అచెంచల విశ్వాసంతో
నావను ఒడ్డుకు చేర్చువాడు,
అవుతాడు ధీరుడు

అణగారిన బడుగుల
అభ్యుదయానికి
అవమానాలు సహించి
ఉన్నత విద్యనభ్యసించి
తన ప్రతిభతో గుర్తింపు
తన మాటతీరుతో మెప్పింపు
అందరిని  ఓపికతో ఒప్పింపు
అంటారానితనంపై కనువిప్పు
తృణప్రాయంగ మంత్రి పదవి త్యజించి
పాత్రికేయుడై నిమ్నజాతి అయితే నేం
అందులో మాణిక్యాలు ఉంటారని
ఋజువు చేసిన    మహనీయులు
బాబా సాహెబ్ అంబేద్కర్
వారి వర్దంతి  నాడు స్మరిద్దాం ఓమారు
ఆ రాజ్యాంగనిర్మాతను
రిజర్వేషన్ల సూత్రదారిని
ఆ భారత రత్నాన్ని

డా వి.డి.రాజగోపాల్ 
9505690690 

0/Post a Comment/Comments