తెలుగుభాష గొప్పది-గద్వాల సోమన్న

తెలుగుభాష గొప్పది-గద్వాల సోమన్న

తెలుగుభాష గొప్పది
-----------------------------------
మిగుల గొప్పది తెలుగు
తెలుగు వారికి గొడుగు
బాషలందున వెలుగు
ఓ వెన్నెలమ్మ !!

తెలుగు భాషే మేటి
లేదు దానికి సాటి
నమస్సులు శతకోటి
ఓ వెన్నెలమ్మ !!

తేనె వంటిది తెలుగు
దాని విలువను ఎరుగు
ఘనత ఎంతో పెరుగు
ఓ వెన్నెలమ్మ !!

తెలుగు వారికి అండ
గుబాళించే దండ
తెలుగు బంగరు కొండ
ఓ వెన్నెలమ్మ !!

తెలుగు తీయని వెన్న
బాషలందున మిన్న
సిరిసంపదల కన్న
ఓ వెన్నెలమ్మ !!

వెన్నెల చల్లదనం
మల్లెల తెల్లదనం
తెలుగే మూలధనం
ఓ వెన్నెలమ్మ !!
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments