మట్టి నుండే మెతుకు పుట్టే...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

మట్టి నుండే మెతుకు పుట్టే...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

మట్టినుండే‌ మెతుకు‌ పుట్టె !

ఒకరు...శ్లోకాలు
పఠించి పఠించి
ఓ కొత్త జంటకు
కమనీయంగా
కళ్యాణం జరిపించే
శోభనంగదికి పంపించే
జేగంటలు మ్రోగించే
సంతానం కోసం
సమరం జరిపించే
కెవ్వుమన్న ఓ కేక వినిపించే
కొత్త జంటల కడుపు‌లు...పండే

ఒకరు...రేయింబవళ్లు
రెక్కలు ముక్కల్జేసి
దుక్కి దున్నే
సేద్యం చేసే
స్వేదం చిందించే
మట్టిని మంత్రించే
మెతుకును సృష్టించే
కోట్లాది మందికి కడుపులు...నిండే

ఒకరుండే గుడిలో చల్లనినీడలో
ఆ పరమేశ్వరుని పదసన్నిధిలో

ఒకరుండే మడిలో ఎర్రని ఎండలో
దళారుల దగాకోరుల విషకౌగిలిలో

మరి వీరిలో విజేత ఎవరు ?
ఇద్దరూ విజేతలే కారణం...?

ఒకరు మెతుకును...సృష్టిస్తే
మరొకరు
ఆ మెతుకును సృష్టించే శక్తినే...సృష్టించే

ఔను ఆనాడు మట్టి నుండే ఈ మనిషి పుట్టె
నేడు తిరిగి ఆ మట్టి నుండే‌ ఓ మెతుకు‌ పుట్టే

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్





 

0/Post a Comment/Comments