మిల్కీ సిల్కీ డా.. కందేపి రాణీప్రసాద్.

మిల్కీ సిల్కీ డా.. కందేపి రాణీప్రసాద్.


మిల్కీ సిల్కీ
  డా.. కందేపి రాణీప్రసాద్.

రెండోసారి అమ్మను కాబోతున్నానని డాక్టర్ చెప్పినపుడు ఈ సరి ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే నా ఫ్రెండ్స్ అందరికి ఆడపిల్లలు, కొందరికి ఇద్దరూ కూడా పుట్టి ఉన్నారు. మా అమ్మకు మేము ఒకమ్మాయి, ఒకబ్బాయి కదా! నాకు అబ్బాయి పుట్టేశాడు కదా. ఈ సారి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందని ఆశపడ్డాను. ఈ సరి పెద్ద లిస్ట్ తాయారు చేయక ముందే పేరు ' స్వాప్నిక ' అని రాసేసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏదైనా కృషి చేసి పైకి రావాలంటే వారికీ సృజనాత్మకత, స్వాప్నికత అవసరం అని మా భార్యాభర్తలిద్దరం అనుకున్నాం. తర్వాత పెట్ నేమ్ ఎం పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. మధ్యలో మా తమ్ముడు వచ్చి పెద్దోడికి ' స్వీటీ ' అని పెట్టారు. వీడికి ' కాపీ ' అని పెట్టేయండి. వచ్చినా వాళ్ళందరూ వాడ్ని తినేసి విడ్ని తాగేస్తారు అన్నాడు సరదాగా జోకేసి నవ్వుతూ. వెంటనే నా బుర్రలో ప్లాష్ వెలిగింది. కాఫీ దేనితో పెడతాం? పాలతో కదా! పల ప్లేరు పెట్టేస్తా పెట్ నేమ్ ' మిల్కీ ' వచ్చేసింది అని సంతోషంగా అన్నాను " వాడు అనడం, నువ్వు పెట్టడం బాగానే ఉంది" అని మా అమ్మ నిట్టూర్చింది ఇన్ని ప్లానుల తర్వాత మరల అబ్బాయే పుట్టడం, స్వాప్నిక కాస్తా ' స్వాప్నిక్ ' కావడం చక చకా జరిగి పొయ్యాయి.
ముద్దు పేరు మిల్కీ అని మార్చలేం కాబట్టి ' మిల్కీ ' గానే ఉంచేశాం. మా మిల్కీ పేరు ఎంత సెన్సేషన్ అయిందంటే చాల మంది మా అబ్బాయి పేరు చూసి బాగుందని పెట్టుకున్నారు. మా కారు వెనక అద్దం మీద స్వీటి మిల్కీ అని రాసి ఉండేది. మా పిల్లల అసలు పేర్ల కన్నా ముద్దు పేర్లే పాపులర్ అయ్యాయి. మా రచయితలు మా మిల్కీ పేరును వాళ్ళ మనవరాళ్ళకు పెట్టుకున్నారు. మా డాక్టర్లు సైతం స్వీటీ, మిల్కీ అని వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు. అలా పేర్లు చాల పాపులర్ అయ్యాయి.
సరే ఈ మిల్కీ చిన్నప్పుడు జుట్టు బాగా మెరుస్తూ ఉండేది. తల మీద స్నానం చేయించి పడుకోబెట్టగానే గాలికి ఎగురుతూ సిల్కిగా ఉండేది పిల్లల జుట్టు ఎలాగూ మెత్తగా పట్టు కుచ్చుల్లా మెరుస్తూ ఉంటుంది. మా వాడికి ఇంకొద్దిగా ఎక్కువగా సిల్కిగా ఉండేది. అప్పుడు మా తమ్ముడు పెద్దోడికి ఎలాగూ స్వీటీ ఫ్రూటి అని పెట్టేశారు అందరూ. వీడిని ' సిల్కి మిల్కీ ' అని పిలిచేద్దాం. వీడూ వీడి జుట్టూ సరిపోతుంది అన్నాడు అలా సిల్కి మిల్కీ అయ్యాడు.
ఈ సిల్కి మిల్కీ కి మోటారు సైకిళ్ళు, కార్లు అంటే చాల ఇష్టం. ఎన్ని సార్లు మోడల్స్ కోనుకున్నాడో. అప్పట్లో మోటార్ బైక్ ల బొమ్మలు పెద్దగా లేవు. అందుకే వాళ్ళ డాడీ బండి మీద కూర్చుని ఆటలాడేవాడు. వాడు ఏడుపు మొదలెట్టగానే స్కూటర్ కిక్ కొట్టి స్టార్ట్ చేస్తే హ్యాండిల్ తిప్పుతూ సంతోష పడేవాడు.
మా ఇంట్లో ఉన్న చేతక్, సుజికీ చాలక మా పాలవాడు వేసుకోచ్చే రాజ్ దూత్ మీదకు ఎక్కేవాడు. పాలవాడేమో " వేరే ఇళ్ళకు పాలు పోయాలి దిగండి బాబూ" అని బతిమిలాడే వాడు దించాగానే మిల్కీ ఏడుపు స్టార్ట్ చేసేవాడు. ఇంటి క్పక్కన వాళ్ళకున్న బులెట్ కూడా ఎక్కి అడుకునేవాడు బైక్ లు, కార్లు, విమానాల బొమ్మలతో బాగా అడుకునేవాడు.
మా మిల్కీకి తెలియకుండా ఆటల్లోనే చదువు నేర్పించేశాను నేను. మా ఇంటి ముందు అరుగు ఎత్తుగా ఉంటుంది. బాబును అక్కడ నిలబెట్టి నేను కింద నిలబడి బాల్ అట ఆడేవాళ్ళం. అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి మిల్కీకి. బాల్ పట్టుకుంటే నీకు పాయింట్ అంటే సంతోషంతో చప్పట్లు కొట్టేవాడు. ఇలా ఆడుతూ ఆడుతూ ఒన్ పాయింట్ నాకు, టూ పాయింట్స్ నీకు అంటూ చెప్తుంటే తను కూడా ఒన్ పాయింట్, టూ పాయింట్స్ అంటూ పలికేవాడు. అలా ఒన్, టూ, త్రీ లు నేర్పించేశాను. మా బాబూ అట ఆడిస్తుంది మమ్మీ అనుకున్నాడు గానీ నంబర్స్ నేర్పిస్తుందని అనుకోలేదు.
అలాగే ఇంటి ముందు ఖాళి స్థలంలో సిమెంట్ చేసి మధ్యలో గీతాలు కొట్టి ఉంటుంది. అంటే బండలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. మధ్యలో గీత తొక్కకుండా జంప్ చేయాలి అని చెప్పేదాన్ని. అప్పటి దాకా రెండు అడుగులు నడిచి గీత రాగానే జంప్ చేసేవాడు. ఒక సారి జంప్ చేయగానే ఒన్ పాయింట్ అని చెప్పేదాన్ని. జంప్ చేసినా గీత మీద కాలు పడేది. నువ్వు అవుటయ్యావు. ఇప్పుడు నేను ఆడాలి అని నేను ఆడేదాన్ని. ఇలా ఎదో ఆటలు సృష్టించి వాళ్ళకు బోర్ కొట్టకుండా ఆడుకునేలా ప్రోత్సహిస్తూ, మళ్ళి దాంట్లో చదువూ చెప్పేసేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ చెబుతుంటే " నన్ను మోసం చేసి చదివించావమ్మా" అంటాడు.
సాయంత్రం 4 గం.ల నుంచి 6 గం.ల దాకా మావారు హాస్పిటల్ కు వెళ్ళిపోతారు. ఇక ఆటైమంతా ఆటలే. స్నానం చేయించేసి డ్రస్ వేసేసి, పాలు తాగించేసి షికారుకు బయల్దేరే వాళ్ళం. పిల్లలుకు ' అచ్ ' వెళ్ళటమంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు కదా! మా ఇంటి దగ్గర నుంచి ఐదారిళ్ళు దాటితే గానీ మెయిన్ రోడ్డు రాదు. ఆ మెయిన్ రోడ్డు వద్దకు వెళ్ళి నిలబడితే వచ్చి పోయే వాహనాలను చూస్తూ సంతోషించేవాడు. సాయం సమయం కాబట్టి అందరూ పనులు ముగించుకుని అరుగుల మీదికి చేరేవాళ్ళు. మేం కూడా వాళ్ళతో చేరి ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిచి పోయేది. 6.00 గం.లకు మావారి బండితో పటు మేము కూడా ఇంటికి చేరే వాళ్ళం.
ఆ తర్వాత వాళ్ళ డాడీ పేషంట్స్ ను చూస్తుంటే తను కూడా అక్కడే ఆడేవాడు. 7 గం.ల కల్లా సెరిలాక్ తినిపించేసి నిద్ర బుచ్చేదాన్ని. ఇది మా సిల్కి మిల్కీ ముచ్చట్లు.

0/Post a Comment/Comments