ఈ రోజు మహానటి జయంతి సందర్బంగా
అభినేత్రి సావిత్రి..
అక్షయ కళాభినేత్రి
మహానటి సావిత్రి
సహాయనటిగా, అతిధిపాత్రllo
ఎంపికయ్యి..
అనితర సాధ్యంగా
నటనలో అగ్ర తాంబూలమందిన
అభినయ శిల్పం !
నడకలో, చూపులో, పెదవివంపులో
చుబుకంలో చుక్కలకెగిరే నటన
ముంగురులూ నటిస్తాయి
విషాదమూ,విరహమూ
గుప్పిస్తూ అల్లనల్లన కదులుతూ!
నిండైన విగ్రహం,
మహిళా ధీరత్వం
గుండ్రని ముఖంలో గుమ్మెత్తే
భావ కుసుమాలు
గాజులచేతుల్లో
ఘనమైన ధాతృత్వం...
నిర్మాతలకు కనకవర్షం కురిసే
కథా చిత్రాల నాయిక!
ప్రేమ రాహిత్యం
గుండెల్లో సునామీగా
వ్యధాభరిత జ్ఞాపకాల జ్వాల
దహించి వేసే తీరై..
నమ్మకద్రోహం నమ్మలేక
సుదూర తీరాలకు పయనం!
సావిత్రి.. వట వృక్షమై
నీడ నిచ్చిన అభినేత్రి!!
అక్షర పుష్పాంజలి!!