సుభాషితాలు-గద్వాల సోమన్న

సుభాషితాలు-గద్వాల సోమన్న

" సుభాషితాలు "
--------------------------------
నవ్వుతూ బ్రతకాలి
పువ్వులా విరియాలి
గువ్వలా విహరిస్తూ
మువ్వలా  మ్రోగాలి

ఉక్కులా  ఉండాలి
మొక్కలా ఎదగాలి
చక్కని మార్గంలో
చుక్కలా వెలగాలి

బుద్ధి బాగుండాలి
శుద్జ హృదయముండాలి
ముద్దులొలుకు నగవుతో
హద్దులో ఉండాలి

తెలివితో నడవాలి
తెలుగులో నుడవాలి
విలువైనది జీవితం
మేలు చేస్తుండాలి

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments