బంగారు బ్రతుకులు - దొడ్డపనేని శ్రీ విద్య

బంగారు బ్రతుకులు - దొడ్డపనేని శ్రీ విద్య

*మట్టి బ్రతుకులు*
*బంగారు బ్రతుకులు*

మట్టిలో పుట్టిన బ్రతుకు
పట్టినా దొరకని మెతుకు

పొద్దు పొడిచిన నాటి నుండి
పొద్దుగూకే వరకూ
సాగుతుంది నీ జీవనం మట్టిలో
చెమట చిందించినా
దొరకునా కాయ కష్ట ఫలం

సూర్యునితో పోటీపడి
పరుగెత్తే సమయం
పుడమి విశ్వ రూపం దాల్చినా
ఆరడుగుల నేల కోసం
మట్టి సంతకం నీ నేల బ్రతుకు

గెలిచినా ఓడినా మట్టిలోనే
చిందేసి ఆడినా పాడినా బురదలోనే
కష్ట నష్టాలు మదిలో మాసి
ఎండకు ఎండి...….
వానకు తడిసి.....
కాలం కలిసి రాకున్నా.....
మట్టినే నమ్ముకున్న 
బంగారు బ్రతుకులు మావి
బంగారు హృదయాలు మావి
...................................


*దొడ్డపనేని శ్రీ విద్య*
విజయవాడ
కృష్ణా జిల్లా
03/12/2021

0/Post a Comment/Comments