జైల్లో జలగలు... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

జైల్లో జలగలు... పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

జైల్లో జలగలు...

నిజానికి అందరు
అవినీతికి పాల్పడరు
తప్పు చేసేది ఒక్కరే
శిక్ష మాత్రం ఇంటిల్లిపాదికి...

ఆశతో అత్యాశతో అవివేకంతో
పీకలదాక మేసిన లంచాలకు...
ఒడిగట్టిన ఒక ఘోర పాపానికి...
ఇంటి పెద్ద చేసిన ఒక పాపిష్టి పనికి...
పాల్పడిన అడ్డూఆపులేని అవినీతికి...

కుటుంబం మొత్తం
కుళ్లి కుళ్ళి ఏడుస్తుంది?
కుమిలి కుమిలిపోతుంది?
నిండు నూరేళ్లజీవితాలు
అర్ధాంతరంగా అంతమౌతాయి
బంగారు బ్రతుకులెన్నో బలైపోతాయి?
ఏ పాపమెరుగనివారు జైలుపాలౌతారు ?

అక్రమార్జన మరీ ఎక్కువైతే
దోచుకున్నది ఎక్కడ దాచుకోవాలో
అర్ధంకాకపోతే ఎవ్వరి కంటపడకుండా
బుట్టల్లో బట్టల్లో చుట్టి
ఇంట్లోనే ట్రంకుపెట్టెల్లో పెట్టి
గోనెపట్టల్లో డబ్బుల కట్టలు కట్టి
స్థిరాస్తి డాక్యుమెంట్లు బంధువుల ఇళ్లల్లో
బంగారు నగలు డిపాజిట్లు బ్యాంకులాకర్లలో
భద్రంగా దాచిపెడతారు అవస్థలెన్నో పడతారు

ఔను ఇన్ని ఇబ్బందులనెదుర్కొనే కన్న
తాము తినక అనుభవించక పరులకు పంచక
ఖాతాల్లో వృధాగా పడివున్న ఆ డబ్బునే
ఆసుపత్రుల్లో అనేక జబ్బులతో 
అవస్థలు పడే నిరుపేదలకు పంచితే
ఎంత పుణ్యము దక్కునో కదా!

ఓ అవినీతి అధికారుల్లారా !
మీ కిదే నా అక్షర సందేశం !
కోట్లు కోట్లు దోచుకోకండి !
స్విస్ బ్యాంకుల్లో దాచుకోకండి !
ఎందుకు ఆ జలగల బ్రతుకు ?
క్షణ క్షణం భయంతో చచ్చే
ఆ దొంగ బ్రతుకెందుకు ‌చెప్పండి ?
ఇకనైనా మీ వక్రబుద్దిని మార్చుకోండి !
అవినీతికి అక్రమార్జనకు స్వస్తి పలకండి !
దర్జాగా దొరల్లా తలెత్తుకు తిరగండి !
అందరికీ...ఆదర్శంగా...గౌరవంగా బ్రతకండి...ప్రశాంతంగా...జీవించండి !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

(యాంటీ కరప్షన్ డే సందర్భంగా చిరుసందేశం)

 

0/Post a Comment/Comments