*మహానటి* సావిత్రి జయంతి సందర్భంగా.. శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

*మహానటి* సావిత్రి జయంతి సందర్భంగా.. శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

*ఓర చూపుతోనే కళలెన్నో పండించిన*
*ఆమే కళ్ళు సినీ జగత్తులో ఎన్నటికినీ వెలిగే తారకలే..*

అందంతో..
అభినయంతో..
అభిమాన హృదయాలెన్నో మెప్పించి
అభినేత్రిగా అద్భుతమైన నటనతో జీవించిన మహాద్భుతమామే..

నాడు వెండితెరనేలిన మహారాణే అయినా
పసితనం వీడని బంగరు బొమ్మా..
మంత్రముగ్ధుల్ని చేసే ముఖ కవలికలతో
వర్ణణాతీతమైన అభినయం ముందు ఎవరైనా అబ్బుర పడాల్సిందే..

రంగుల లోకానికందిన వరంగా
చెరిగిపోని చిరునవ్వుల సంతకమందించినా
నిజ జీవితం మాత్రం ఎందరికో అందివచ్చిన పాఠమయింది..

 వెన్నెల మోముతో ..
వెన్న వంటి మనసుతో..
ఎత్తుపల్లాలెన్నో చూసిన అనుభవాలెన్నున్నా
నమ్మినవారే నట్టేట ముంచితే కోలుకోని దెబ్బ బతుకును శత్రువై వెంటాడే..

కఠిన రూపు దాల్చిన కాలమామెను కన్నీరు పెట్టించినా..
మానవత్వమే ఆభరణంగా ఎదిగిన సావిత్రి వెండితెరపై నాటికీ నేటికి ఎప్పటికీ మహా సామ్రాజ్ఞినే..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments