ఉమ్మడి కుటుంబమా నీ జాడేది - దొడ్డపనేని శ్రీ విద్య

ఉమ్మడి కుటుంబమా నీ జాడేది - దొడ్డపనేని శ్రీ విద్య

ఉమ్మడికుటుంబమా నీ జాడేది*

ప్రేమలు ఆప్యాయతలు
ఉన్నాయా అనిపిస్తుంది
కుటుంబ వ్యవస్థ
రోజు రోజుకు దిగజారిపోతుంది

వసుదైక కుటుంబం అనేది
ఓ కలగా మిగిలి పోయింది
జగమంత కుటుంబం మాది
ఏకాకి జీవితం నాది
అన్నట్లుగా

చిన్న కుటుంబం
చింతలు లేని కుటుంబం
కానీ,
బంధాల విలువ తెలియదు
ఆప్యాయతా అనురాగాల కరువు
ఆపోహలు, అనర్థాల మయము

పెద్దల పై గౌరవం శూన్యము
ఎవరి లోకం వారిది
ఎదురెదురుగా ఉన్నా
మనసులు దూరం
చెట్టు కొమ్మలు నరికినట్టుగా
కుటుంబాలు
ఒక్కరిగా విడిపోతున్నాయి.
స్వార్థాలు రాజ్యమేలుతున్నాయి.
మానవత్వం నశించిపోయింది

భారతీయ సంస్కృతి లో
ఉమ్మడి కుటుంబం కి
ఓ గౌరవం ఉంది
కానీ ఇప్పుడు

ఆలోచనల లో బేధాభిప్రాయాలు

ఎటు పోతుందో ఈ వ్యవస్థ
ఆనాటి సఖ్యత 
ఆనందాలు ఎక్కడ
చెప్పేవారు కరువయ్యారు
వృద్ధాశ్రమాలు దగ్గరయ్యాయి

సమాజ తీరు మారేదెన్నడో
కుటుంబ వ్యవస్థ బాగు పడేదెన్నడో

ఒకసారి ఆలోచించండి
కుటుంబ వ్యవస్థను
బాగు పరచండి

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
12/12/2021

0/Post a Comment/Comments