పోలయ్య కవి కూకట్లపల్లి కి చిరు సత్కారం

పోలయ్య కవి కూకట్లపల్లి కి చిరు సత్కారం

న.ర.సం.అధ్యక్షులు కళారత్న బిక్కికృష్ణచే 
పోలయ్య కవి కూకట్లపల్లికి చిరుసత్కారం

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని యన్జీవోస్ నెట్వర్క్ కార్యాలయంలో మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి వ్రాసిన మూడు నవలలపై జరిగిన సమీక్షా సమాలోచన సభకు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కళారత్న బిక్కికృష్ణ అధ్యక్షత వహించారు.

తెరసం అధ్యక్షులు నాళేశ్వరం శంకర్ ప్రముఖ కథారచయిత విహారి అనువాదకులు ఎలనాగ  సమీక్షురాలు శ్రీమతి రాజా వాసిరెడ్డి మళ్ళీశ్వరి సహజ కవయిత్రి  కళాకొండ ప్రభృతులు 
సభకు ‌హాజరయ్యారు

మూడు నవలలను విహారి నాళేశ్వరం శంకర్ ఎలనాగ సమీక్ష చేశారు...అధ్యక్షులు కళారత్న బిక్కికృష్ణ మాట్లాడుతూ ఈ మూడు నవలలు కవయిత్రి ఝాన్సీ కొప్పి శెట్టి  నిజజీవిత అనుభవాలను నుండి ఆవిర్భవించిన అద్భుత నవలలను ప్రశంసించారు

తదనంతరం జరిగిన కవిమ్మేళనంలో కవి రచయిత పోలయ్య కూకట్లపల్లి " రంకెలు వేస్తున్న రైతన్నలు" అను కవితను చదివి వినిపించారు. వీరు చేస్తున్న ఈ సాహితీ సేవను అభినందిస్తూ  కళారత్న బిక్కికృష్ణ విహారి ఝాన్సీ కొప్పిశెట్టి చేతుల మీదుగా శాలువా ప్రశంసాపత్రం మెమొంటోలతో
పోలయ్య కవికి చిరుసత్కారం జరిగింది...

ఇది నిజంగా "హ్యాట్రిక్" అని తనకు జరిగిన ఈ సన్మానానికి కవి పోలయ్య రాయల వారసునిలా కవులందరిని ఎంతగానో ప్రోత్సహిస్తున్న వెలుగులోకి తెస్తున్న కళారత్న బిక్కికృష్ణకు... మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు...తన
హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు

అలాగే తన సన్మానానికి అభినందనలు తెలిపిన తోటి కవిమిత్రులు ముత్యం వెంకటేశ్వరరావు...శ్రీరంగం సత్యనారాయణ...పూసల సత్యనారాయణ...అద్దంకి లక్ష్మీ...భారత లక్ష్మీ... తాటిపాముల రమేష్ లకు 
ధన్యవాదాలు తెలియజేశారు.

0/Post a Comment/Comments