ఆశల సౌధం - దొడ్డపనేని శ్రీ విద్య

ఆశల సౌధం - దొడ్డపనేని శ్రీ విద్య


* ఆశల సౌధం*


కన్న కలలు కోసం ఇలా
సాకారం చేసుకుంటావు అలఓకగా

అభివృద్ది పై ఓ కన్ను
మిన్నంటే ప్రణాళికల ఆశల గన్ను

ప్రపంచం పై రారాజు లా ఎదుగు
విజయ కేతనంతో నీ అడుగు

విదేశాలలో సైతం ఎదిగిన వ్యాపారం
విస్తరించు దిగంతాల వరకు
 అవాసం

తరతారలకు సమకూర్చిన నీ సంపదమయం
ప్రపంచ కుబేరుల్లో వ్యాపార దిగ్గజం

ప్రాజక్టుల్లో వ్యాపార భాగస్వామ్యం
ప్రపంచాన్నే ప్రభావితం చేసే పోరాటం

రంగుల ప్రపంచంలో
ఉరుకులు పరుగుల జీవితంలో
సాంకేతిక పరిజ్ఞానం లో
నీ కంటూ ఓ గుర్తింపు
అంతర్జాలం లోనూ విస్తరించిన
నీ ఉనికి నే పశ్నిస్తే....
ధనార్జన కై ఆర్జిస్తు....
నీ ఆలోచనలను సాకారం చేసుకో
మంచి వాడివని నిరూపించుకో
అందరికీ సాయం చేస్తూ ముందుకు సాగిపో

👍👍👍👍👍👍👍👍👍

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ


0/Post a Comment/Comments