విముక్తి లేదెప్పటికి పేరు: సి. శేఖర్(సియస్సార్)

విముక్తి లేదెప్పటికి పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక:విముక్తి లేదెప్పటికి

ఏనాడైనా
ఏచోటైనా
పాలనాపగ్గాలెపుడు
జిత్తులమారి నక్కలచేతుల్లోనే
సమాయానుకూలంగా
రంగులుమార్చే ఊసరవెల్లుల గారడిలో
బతుకు బలైపోవాల్సిందే
కాలమేదైనా 
రంగమేదైనా
అణగదొక్కడమే నక్కకు తెలుసు
అణాగారిన వర్గం కళ్లు తెరవకుండా 
మత్తులో పొర్లిస్తరు 
మాయమాటల గారడి వలలోకి నెట్టెస్తరు
ఇదేనా...?
అనాడెందరో పోరాడిన ఫలితం

రెక్కల కష్టాన్ని నమ్ముకుని
జీవిస్తున్న మనుషులు
రాజ్యాంగమిచ్చిన హక్కులను
అమ్ముకునే బతకుల్లో
అభివృద్ధి 
తరాలెన్ని మారినా తడిసిన గొంగడే కదా

అధికారాన్ని చెప్పుచేతుల్లెట్టుకుని
ఉన్నతస్థానంలో కూర్చోవడమే తెలిసిన
కసాయిలున్న దేశంలో
ప్రజలందరూ
సాగిలపడాల్సిన రోజులే ఎన్నడు

రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగారుస్తూ
నిరుపేదల బతుకులు బుగ్గిచేస్తూ
ఓట్లను దొంగిలించి అదిరోహించిన సంహాసనం
ఆసరాగా నిలవాల్సిన అధికారం
ఆశగా ఎదురుచూసే చూపుల్లోని వెలుగల్ని కారుచీకట్లోకి నెట్టెస్తున్నరు

అంధలమెక్కినోళ్ళెప్పుడు
కార్పొరేట్ పాదక్రాంతులౌతూ
నల్లచట్టాలనెన్నో చెస్తున్నోళ్ళకు
ప్రజలగోడసలు వినపడదు
అద్దాలమేడల్లో అంధకారం కనపడదు

మార్పుకావాలనుకున్నోడు
మత్తునొదిలేస్తేనే కదా
లోకపోకడలను బేరీజు వేసకుంటేనే కదా
విలువైన బలమైన ఆయుధాన్ని
ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకుపయోగించాలో
తెలుసుకుంటేనే
బానిసత్వం విముక్తయ్యేది

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు


0/Post a Comment/Comments