" షడ్రుచులు "-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

" షడ్రుచులు "-గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు

" షడ్రుచులు "
-------------------------------
అరటిపండు తీయన
అమ్మ మనసు చల్లన
మిరపకాయ కారం
ఏడు రోజులు వారం

నిమ్మకాయ పులుపు
పాలుపెరుగు తెలుపు
కష్టపడిన గెలుపు
జీవితాన మలుపు

వేపకాయ చేదు
అవసరమే పాదు
పచ్చబొట్టు పోదు
అలకు అలుపు లేదు

పప్పుకు రుచి ఉప్పు
మితిమీరిన అప్పు
తెచ్చిపెట్టు ముప్పు
సర్దుబాటు ఒప్పు

ఉసిరికాయ వగరు
మంచిది కాదు పొగరు
మ్రోగుతుంది డమరు
ఎక్కువైతే వినరు

--గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments