Pravahini



Sent from Yahooఇంగువ
           డా.. కందేపి రాణీప్రసాద్.
ఇంగువ అనేది వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు. 'ఇంగువకు వాసిన కట్టిన గుడ్డ అది వాసనా ఎక్కడికి పోతుంది' అంటూ తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వచ్చినపుడు పెద్దలు అంటుంటారు.కుటుంబానికే ఆ లక్షణం ఉంది పిల్లలకు రాకుండా ఎలా ఉంటుంది అనే సంధర్బంలో ఈ మాటను అంటుంటారు. సాధారణంగా ఇంగువను గాలి చోరబడని డబ్బాలలో నిలువ ఉంచుతారు. కానీ డబ్బా మూత ఏ మాత్రం వదులుగా ఉన్నా ఆ వాసనా వంటిల్లంతా వ్యాపిస్తుంది. ఇంగువ చాల గాఢమైన వాసనను కలిగి ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.
ఈ ఇంగువ ఫేరూలా జాతి మొక్కల తల్లీ వేరు నుంచీ, కండాల నుంచీ లభిస్తుంది. తల్లీ వేరులోని లేటెక్స్ ను ఎండబెడితే ఇంగువ వస్తుంది. దీన్ని 'పేరుం కాయమ్' అంటారు. ఇంగువ లభించే ప్రధానమైన మొక్కల యొక్క శాస్త్రీయ నామాలు " ఫెరూలా ఫోటిడా", మరియు ఫెరూలా అస్సాఫోటిడా. ఇవి 'అంబెల్లి ఫెరె' కుటుంబానికి చెందినా మొక్కలు. సాధారణంగా ఇంగువను ఈ మొక్కల నుండి మాత్రమే తీస్తారు. కానీ ఇదే జాతిలో ఉన్నటువంటి 'సిల్ఫియం' అనే మొక్కల నుండి కూడా ఇంగువను సేకరిస్తారు. ఈ మొక్కలు నార్త్ ఆఫ్రికన్ మొక్కలు. ఇది మాములు ఇంగువ కన్నా తక్కువ ఖరీదుతో లభిస్తుంది. మాములు ఇంగువకు బదులుగా, రెండవ రకంగా సిల్ఫియం మొక్కల ఇంగువను వాడతారు. ఇది చారిత్రిక ప్రాధాన్యం కలిగినటువంటి మొక్కలు. కానీ ప్రస్తుతం ఈ మొక్కలు విలుప్త మైనట్లుగా భావిస్తున్నారు. ఈ జాతులన్నీ ఎక్కువగా ఇరాన్ లోని ఎడారుల్లో నూ, ఆఫ్ఘానిస్తాన్ లోని పర్వతాలలోనూ పెరుగుతాయి.కానీ ప్రస్తుతం భారతదేశంలోనూ, పాకిస్తాన్ లోనూ కూడా ఈ చెట్లను సాగు చేస్తున్నారు.
ఇంగువ యొక్క ఇంగ్లిషు పేరైన asa అనేది, లాటినై జోడ్ పర్షియన్ పదం అయినటువంటి AZA అనే పదం నుంచీ పుట్టింది. AZA అంటే ' బంక ' అని అర్థం. తర్వాత లాటిన్ పదమైన ఫోటిడిస్ యొక్క అర్థం  'smelling fetid'. ఈ ఇంగువ బలమైన గంధకం యొక్క వాసనా కలిగి ఉండటం వలన ఈ పేరు వచ్చింది. దీన్ని మరాటి లో ' హింగా ' అంటారు. ఓరియాలో ' హేంగు ' అని, హిందీలో ' హింగ్ ' అని, బెంగాలిలో ' హిన్ ' అని, కన్నడంలో ' ఇంగు ' అని అంటారు. ఇంకా మలయాళంలో ' కాయమ్' అని, తమిళ బాషలో ' పేరున్ కాయమ్ ' అని పిలుస్తారు. 14 వ శతాబ్దంలో మలయాళ భాషలో ఇంగువను ' రామదామ్ ' అని పిలిచేవారు. ఇలా ఇంగువకు ఒక్కో భాషలో ఒక్కో రకంగా పేరున్నది. ఇంగువను ' దేవతల ఆహారం ' అని పిలుస్తారు. కానీ దీనికున్న గాఢమైన వాసనా వాళ్ళ కించపరిచే పేర్లు కూడా ఉన్నాయి. ఫ్రెంచి లో ' devils shit ' అని,ఇంగ్లిషు వాళ్ళు ' devils dung ' అని కూడా అంటారు.
ఫేరూలా జాతి మొక్కల నుంచీ ఇంగువ లభిస్తుందని తెలుసుకున్నాం కదా! ఫెరులా జాతిలో దాదాపు 170 పై జాతులు ఉన్నాయి. ఇవన్ని కూడా పుష్పించే మొక్కలు. ఇవి 1 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి కాండాలు బొద్దుగా, బోలుగా ఉబ్బినట్లుగా ఉంటాయి. ఆకులూ త్రిదళంగా విభజింపబడి ఉంటాయి. పువ్వులు సాధారణంగా పసుపు రంగులో పూస్తుంటాయి. కానీ అక్కడక్కడా అరుదుగా తెలుపు రంగులో పుస్తుంటాయి. ఈ పువ్వులు ఇక నాభిగా ఉండి 30, 40 రెక్కలు కలిగి ఉంటాయి. కాయలు చదునుగా, కోడి గుడ్డు ఆకారంగా ఉంటాయి. ఎరుపు వర్ణం కలిసిన గోధుమ రంగులో ఉంటాయి కాయలు. అంతేకాక ఈ కాయలు రసంతో నిండి ఉరినట్లుగా ఉంటాయి. ఇంకా వేర్లు మందంగా, బలంగా, కండ కలిగినట్లుగా ఉంటాయి. చెట్టులోని ఏ భాగమైనా, అకులైనా, కాయలైనా, పూలైనా ఇంగువ లాంటి వాసనే వస్తుంది. ఈ అస్సాపోటిడా చెట్టు మీద అడ, మగ పుష్పాలు వేరు వేరుగా ఉంటాయి.
ఫెరులా జాతి చెట్ల యొక్క కాండాల మీద, వేర్ల మీద కారిన జిగురులాంటి పదార్థమే ఇంగువ. సాధారణంగా తుమ్మ చెట్టు బెరళ్ళ నుండి ఇలాంటి బంక మనకు లభిస్తుంది. మొదట్లో మెత్తగా ఉండి ఎండిన కొద్ది పెళ్లల్లాగా అవుతుంది. తుమ్మ, బంక ఎలాగైతే చెట్టు కాండం నుండి సేకరిస్తారో ఫెరులా జాతి మొక్కల కాండల నుండి ఇంగువ పెళ్ళాల్ని తీస్తారు. దీన్ని చెట్ల నుండి తీసినప్పుడు " బూడిద తెలుపు రంగులో ఉంటుంది. గట్టి పెళ్ళల్లాగా వచ్చే ఈ జిగురు పదార్థాన్ని సుత్తితో గానీ, రోకలితో గానీ మెత్తగా చూర్ణం చేస్తారు. ఇలా చూర్ణం చేసిన ఇంగువను బియ్యపు పిండి, మైదా పిండి, గోధుమ పిండులలో కలిపి నిలువ చేస్తారు. మనకు బజార్లో దొరికే ఇంగువలో శుద్దమైన ఇంగువ 30% మాత్రమే ఉంటుంది.
ఆహారంలో ఇంగువను కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగేల చూస్తుంది. ఇది జీర్ణాశయంలో తయారయ్యే గ్యాస్ ను పొట్ట ఉబ్బారాన్ని తగ్గిస్తుంది. అందువల్ల దీనిని ఔషధ మొక్కగా గుర్తిస్తారు. అందుకే దీనిని ఒక మసాలా దినుసుగా వాడుకుంటున్నాము. దీనిని ఆహారంలో వాడినప్పుడు ఉల్లిపాయల వాసన లాంటి వాసనకలుగుతుంది. ఇంగువ కనుక వంటింటిలో ఉన్నట్లయితే మిగతా పదార్థాలన్నీ కూడా ఇంగువ వాసననే కలిగి ఉంటాయి. ఉత్తర భారతీయులు వారి శాఖాహార వంటకాలలో ఇంగువను ఎక్కువగా వాడుకుంటారు. మనం కూడా పులిహారలో ఎక్కువగా ఇంగువను వేసి వండుకుంటాము. బంగాళాదుంప, కాలిఫ్లవర్ వంటి శాఖాహార వంటకాలలో ఇంగువను పసుపుతో కలిపి వేసుకుంటారు. పంజాబీయులు కూడా తమ శాఖహర వంటలలో ఇంగువను ప్రత్యేకంగా వేసుకుంటారు వేగే నూనెలో ఇంగువను వేసినపుడు దాని తిక్షణమైనా వాసనా కొంచెంగా తగ్గుతుంది. అందువలన కొంతమంది తిరగమాత పెట్టె నూనెలో వెల్లుల్లి ముద్దతో పాటుగా ఇంగువను వేసి వేయిస్తారు. వాణిజ్యపరమైన ఉత్పత్తులలో ఇంగువను బియ్యం, గోధుమ పిండులే కాక పసుపుతో కూడా కలిపి నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసే ఇంగువు ఎగుమతి చేస్తారు. Mail on Android

0/Post a Comment/Comments