Pravahini



Sent from 
సూర్యుడు పెద్ద స్టవ్
           డా.. కందేపి రాణీప్రసాద్.
మా కిద్దరు అబ్బాయిలు. సృజన్, స్వాప్నిక్ . పెద్ద వాడికి మెడిసిన్ అంటే మహా ఇష్టం. చిన్న వాడికి టెక్నాలజీ అంటే ఇష్టం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ వాటి గురించే మాట్లాడుకునేవారు. వాళ్ళ కిష్టమైనవే చదివేవారు. టివిలో సృజన్ సుఖీభవ లాంటి ఆరోగ్య పరమైన కార్యక్రమాలు చూస్తే, స్వాప్నిక్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రానిక్స్ ఏమేం వచ్చాయో చూసేవాడు. చివరికి వార్తత్రికల్లో న్యూస్ కూడా ఎవరికీ నచ్చినవి వారు చదివి ఆర్టికల్స్ ను కట్ చేసి దాచుకొనేవారు. ఇలా వాళ్ళు కట్ చేసి దాచుకున్న పేపరు కటింగులన్నీ నేను ఎవరిదీ వారికి ఒక పుస్తకంలా బైండింగ్ చేయించి ఇచ్చాను. వాళ్ళు పెద్దయ్యాక జ్ఞాపకంగా ఉంటాయని. ఇలా కొన్ని వందల పేపర్ కటింగులున్నాయి పిల్లల దగ్గర. సరే మీకింతకి ఈ రోజు మా చిన్నోడి కబుర్లు చెప్పాలి.
మా చిన్నబాబు అప్పుడు రెండోతరగతో, మూడోతరగతో చదువుతున్నాడు. వాళ్ళ పుస్తకంలో నీటి గురించి పాఠం ఉంది. నీరు మూడు రూపాల్లో ఉంటుంది – నీరుగాను, మంచుగాను, అవిరిగాను అని. నీరు అంటే మాములుగా మనం త్రాగే మంచి నీరునూ, మంచు అంటే ఫ్రీజ్ లోని ఐస్ క్యూబ్ ను చూపించి వివరించాను. ఆవిరి రూపంలో ఉండే నీరు గాలిలో ఉంటుందని చెబితే అలా ఎలా ఉంటుందని వాళ్ళ డౌట్. సరే బాగా అర్థమయ్యేలా చెబుదామని ఒక గిన్నెలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే కొంత సేపటికి గిన్నెలో నీళ్ళు మిగల లేదు మరియు పోగల పైకి లేవటమూ కనిపించింది. ఇలా నీటిని వేడి చేస్తే అవిరౌతుంది అని చెప్పగానే చాల బాగా అర్థమైందని తలూపాడు వాడు.
వాడు అర్థమైందనగానే నాకింకా ఆనందమేసి వర్షం గురించి చెప్పటం మొదలు పెట్టాను. ఆకాశంలో మబ్బులు వాతావరణంలోని నీటి ఆవిరిని పీల్చుకొని, ఆతర్వాత చల్లబడినపుడు వర్షంగా మారుతుందని చెప్పా. 'వాతావరణం లోకి నీటి ఆవిరి వెళ్ళాలంటే నీళ్ళు కావాలి కదా! నీళ్ళేక్కడివి? మన ట్యాంక్ లో వా?' అని అడిగాడు మా వాడు. నేను నవ్వి 'మన ట్యాంక్ లోవి కాదు! సముద్రం లో బోలెడు నీళ్ళు ఉంటాయి కదా! ఆ నీళ్లనే మేఘాలు పీల్చుకుంటాయి. మళ్ళి మనకు వానలా ఇస్తాయి. ఇదే వాటర్ సైకిల్ అంటే" అని నేను చాల బాగా చెప్పానని ఫీలవుతూ వాడి వంక చూశా. వెంటనే వాడు 'మమ్మీ! మరీ సముద్రం ప్రక్కన పెద్ద పెద్ద మంటలతో స్టవ్ లు పెడతార' అన్నాడు. బాగా అర్థమయ్యేలా పాఠం చెబుతున్నానని నేననుకుంటే నాకు అర్థం కానీ ప్రశ్నలోస్తున్నాఏంటి మద్యలో అనుకున్నాను. ఏంటో వాడినే అడగితే పోలా అనుకోని అడిగితే ఇలా సమాధానం చెప్పాడు. మమ్మీ నువ్వు నీళ్ళ గిన్నెను మంటపై క్పెట్టి వేడి చేస్తేనే కదా అవి ఆవిరిగా మారుతున్నాయి. మరీ సముద్రం నీళ్ళు వేడెక్కలంటే పెద్ద పెద్ద మంటలు పెట్టాలి కదా!" అన్నాడు. వాడి రీజనింగ్ కు ఆశ్చర్య మేసింది. దాంతో పాటు సముద్రం నీళ్ళు వేడి చేయడానికి మంటలు పెట్టాలన్న విషయమూ నవ్వు తెప్పించింది. తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పినా 'మీ అబ్బాయి తెలివి గలవాడే 'అంటూ తెగ నవ్వేవాళ్ళు.
ఆ తర్వాత అసలు విషయం చెప్పాను నేను. సముద్రం నీళ్ళు వేడెక్కాలంటే మన వాళ్ళ కాదు. ఆ పని కోసం సూర్యుడున్నాడు. సూర్యకిరణాల ఉష్ణోగ్రత వాళ్ళ నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది. అని దాంతో మా బాబు 'ఓహో సూర్యుడు పెద్ద స్టవ్' అన్నమాట అన్నాడు. సూర్యునికి ఈ పోలిక ఇంతవరకు ఎవరు పెట్టలేదనుకుంటా. చాల మంచి ఉపమానం అన్నారు కవి మిత్రులు. ఇది మా అబ్బాయి పరిశోధన. ఇంతకి ట్విస్ట్ ఏంటంటే టెక్నాలజీని ఎంతో ఇష్టపడ్డ ఈ బాబు ప్రస్తుతం మెడిసన్ చదువుతున్నాడు. మెడిసన్ ఇష్టపడ్డ పెద్దబాబు బయోటెక్నాలజీ చదువుతున్నాడు.
 Mail on Android

0/Post a Comment/Comments