Story

StorySent from 
మట్టి వినాయకులు
          డా.. కందేపి రాణీప్రసాద్.
వినాయక చవితి సమిపిస్తోంది అందరి ఇళ్ళలో పండగ కల తాండవీస్తోంది. పిల్లలు, యువకులు చాల ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడెక్కడ మంచి వినాయకులు దొరుకుతారా అని విషయ సేకరణ చేస్తున్నారు. హైస్కులు స్థాయి తమ్ముళ్ళు అన్నయ్యల్నే అనుకరిస్తున్నారు. అందమైన రంగులున్న గణపతుల్నే తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. అందులోనూ స్టైలిష్ గా ఉండే డ్యాన్స్ గణపతి గానీ, క్రికెట్ అదే గణపతిని గానీ తెచ్చుకోవలనుకుంటున్నారు.
ఆ ఊరి చివర ఒక చెరువు ఉన్నది. ఆ చెరువు ఎప్పుడూ చేపలతో కళకళలాడుతుండేది. ఆ నీళ్ళే ఉరంతటికి దాహం తీర్చేది. కాని ఎందుకనో పోయిన సంవత్సరం నుంచి ఆ నీళ్ళు రంగు మారిపోయాయి. ఊరి వారందరికి కాళ్ళు వంకర పోవడం, మరియు చర్మ సమస్యలు రావడం మొదలయ్యింది. చేపలు కూడా చచ్చిపోవటం మొదలయ్యింది. చేపల వేట మీద ఆధారపడే జాలర్లకు కుటుంబం గడవక వేరే పనులు చేసుకుంటున్నారు. పెద్ద వాళ్ళంతా ఒక రకమైన నిరాసక్తతో ఉన్నా పిల్లలకు ఇదేం పట్టవు కదా! వాళ్ళ ఆనందంలో వాళ్ళున్నారు.
అందమైన రంగులు వేసి ఉన్న గణపతుల కోసం యువకులు ఊరి చివర ఉన్న కొట్టు దగ్గర కెళ్ళారు. మాకి గణపతి కావాలి. మాకీ వినాయకుడు నచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంతలోకి అక్కడికి నలుగురైదుగురు వ్యక్తులు వచ్చారు. వాళ్ళని వాళ్ళు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులమని పరిచయం చేసుకున్నారు.
" చూడండి బాబూ! మీరు అందంగా ఉన్నాయని ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన వినాయకులని ఇష్టపడుతున్నారు కదా! కానీ ఈ రంగుల్లోని రసాయనాలన్ని విశ పూరితం. ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులలో లెడ్, క్రోమియం, కొబాల్టు ద్రావణాలుంటాయి. ఇంకా చూశారా ఈ వెండి రంగులో స్ట్రాన్షియం, జింక్ ద్రావణాలుంటాయి. వీటి వలన జల చరాలకు హాని కలుగుతుంది పోయిన సంవత్సరం ఇదే చెరువులో గణేష్ నిమజ్జనం జరిగింది. ఆ తరువాతే చేపలు చచ్చిపోయాయి. జీవనోపాధి కోసం జాలర్లు కూలీలుగా మారారు" వాళ్ళలోని ఒక వ్యక్తి ఆపకుండా చెప్తూ పోతున్నాడు.
ఆ యువకులకేం అర్థం కాలేదు. " ఇవన్ని మాకెందుకు చెప్తున్నారు మీరు" అయోమయంగా అడిగారు వాళ్ళు.
" అదే బాబూ! అక్కడికే వస్తున్నా మీరు ఈ విగ్రహాలను కొనవద్దు. ఈ పి ఒ పి విగ్రహాల వలన చాల నష్టాలున్నాయి" అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగానే ఆ యువకుల్లో ఒకరికి చాల కోపమొచ్చింది.
" మేము విగ్రహాలు కొనవద్దు అని చెప్పడానికి మీరెవరు? పండుగలు, సంప్రదాయాలు మీకు ఇష్టం లేదా! మమ్మల్ని ఆపేందుకు మీకేం అధికారం ఉంది" అంటూ కోపంగా ప్రశ్నించాడు.
"కోపం తెచ్చుకోకు బాబూ! పండుగ చేసుకోవద్దు అనటం  లేదు. పి ఒ పి విగ్రహాలు వద్దు అని అంటున్నాను. సీసం, కొబాల్టు ద్రావణాల వలన క్యాన్సర్లు, ఉపిరి తిత్తుల వ్యాధులు వస్తాయి. నీరు కలుషితమై తాగడానికి పనికి రాకుండా పోతుంది. దీని వాళ్ళ ఎండాకాలం చాల ఇబ్బంది పడతారు" అని చెబుతు ఉన్నాడా వ్యక్తి.
" వింటున్నామని ఆగకుండా చెబుతున్నారు. విగ్రహాలు కొనవద్దంటావు. మరి పండగేలా చేసుకోవాలో చెప్పవేం" అన్నాడు యువకుడు విసిగిపోతూ.
" మట్టి వినాయకుళ్ళని వాడాలి బాబూ! నిమజ్జనం చేసినప్పుడు తేలికగా కరిగిపోతాయి. ఏ రసాయనాలు ఉండవు. అందరి మంచి కోసమే చెబుతున్నాం బాబూ" అన్నాడా వ్యక్తి.
" అంతేనా! మట్టి విగ్రహాలే కొనుక్కుంటాం ఇంకా పండుగ వద్దంటారో, మమ్మల్ని మా సంతోషాన్ని పాడు చేస్తారో అనుకున్నాం" అన్నారు ఓ కె చెబుతు యువకులంతా!
 Mail on Android

0/Post a Comment/Comments