జయహో మహాత్మా! బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

జయహో మహాత్మా! బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

జయహో మహాత్మా! (కవిత)
---------------------------------------
జయహో జయహో మహాత్మా
జయ విజయీభవ మా పరమాత్మా
మా భారత ప్రజలందరి నేతవు 
మా ఆరతి గైకొను శాంతిదూతవు !

పోరుబందరు గ్రామంలో పుట్టి పెరిగి
పోరుసల్పుతూ దేశసేవకై నడుం కట్టి తిరిగి
అహింసా ఆయుధాన్ని స్వయాన నీ చేతబట్టి
సాగించావులే స్వాతంత్ర సమరాన్ని  
ప్రతినబట్టి !

ఆంగ్లేయుల మెడలను నువ్వు వంచావు
మా  దాస్యశృంఖలాలకు తెర దించావు
విదేశీ కుతంత్రాన్ని అహింసతో బంధం చావు
దేశ స్వాతంత్ర్యాన్ని సరుగును మా కందించావు !

బొల్లి గద్ద వచ్చి రివ్వున కోడి పిల్లను
తన్ను కెళ్లి దవ్వున పైకి తీసుకెళ్లి నట్లుగా
ఆంగ్లేయులు వచ్చరిగా దొంగచాటుగా
మన దేశ సంపదను కొల్లగొట్టిరి ఉన్నపాటుగా !

భరత జనుల యోగక్షేమాలను ఆశించి
భారతదేశం వదిలి పోవాలని ఆంగ్లేయులు శాసించి
అహింస సమర శంఖాన్ని నీవు పూరించారు
హింసే లేకుండా స్వాతంత్రాన్ని సాధించారు !

మీరు మన దేశం స్థితిగతులను ఆలోచించి
రాత్రింబవళ్ళు మా బాగా అవలోకించి
మీరు సత్యాగ్రహ జ్యోతిని వెలిగించారు
మా నిత్యగ్రహబాధల తొలగించారు 

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments