నవ్వుల పువ్వులు(కవిత). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

నవ్వుల పువ్వులు(కవిత). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

నవ్వుల పువ్వులు (కవిత)
-----------₹₹₹₹--------------
నవ్వులు నవ్వులు నవ్వులు నవ్వులు
అవి మన ఆనందాల పువ్వులు
కలిగించును ఆరోగ్యాన్ని నవ్వులు
తొలగించును వైరాగ్యాన్ని నవ్వులు   

కులాస గాను నవ్వుతూ ఉంటే
విలాసమై మన జీవితం ఉంటే
కొదువ అన్నది లేదులే మనకు
ఎవరేమి చెప్పిన నీవిక వినకు !

నవ్వులు నవ్వులు నవ్వులు
చలచల్లని వెన్నెల పువ్వులు
మంచు ముత్యాల తొవ్వలు
కంచు రత్నాల మువ్వలు.  !

నవ్వుల క్లబ్బులు స్తాపించు
ఆరోగ్యంపై శ్రద్ధను చూపించు
నవ్వుల దీపాలను వెలిగించు
కలకాలం ఆరోగ్యంగా జీవించు !

నవ్విన నాపచేను పండదా
రువ్విన సామెత ఉండగా
శనిగల వాడినని అనుకోవద్దు
గలగల నవ్వుతుంటేనే ముద్దు!

నవ్వుల నజరానాలను ఇప్పించండి
పువ్వుల పుప్పొడిని చల్లించండి
ఇల్లంతా నవ్వులతో నింపేయండి
ఒళ్లంతా తూలేలా ఇక నవ్వించండి

నవ్వులే పువ్వులై మిరియాలి
పువ్వులే నవ్వులై కురియాలి
విరిసిన కురిసిన ఆ నవ్వులు
మురిసే మనసుల పువ్వులు !

నవ్వులు నవ్వులు నవ్వులు 
మన ఎదలో పూచిన పువ్వులు
అవి చల్లని వెన్నెల వెలుగులు
పున్నమి పూలై మెరిసే పులుగులు

నవ్వులు నవ్వులు నవ్వులు
కన్నుల కాంతుల వెలుగులు
అన్నుల మిన్నుల కలువలు
మెరిసి విరిసే మేని వలువలు!

నవ్వులు నవ్వులు నవ్వును నవ్వులు
ఆరోగ్యం పాలిటీ వెలగల పువ్వులు
నవ్వులు నాలుగు విధాల చేటన్నది తప్పు
నవ్వులు నాలుగు విధాల మేలని ఇక చెప్పు !

ఈ కవిత "నిత్య"ఇ పేపర్. కై ప్రత్యేకంగా వ్రాసినది. దేనికి ఇది అనుసరణ అనుకరణ కాదని, ఏ బ్లాగులలో, ఏ పేపరు లో ఇంతవరకు ప్రచురణ కాలేదని హామీ ఇవ్వడం అయినది.

మీ గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments