కొత్త సిరుల జయభేరి (కైతికాలు)రమేశ్ గోస్కుల

కొత్త సిరుల జయభేరి (కైతికాలు)రమేశ్ గోస్కుల

బిరబిరమని పరుగునొచ్చె
చీకట్లు చీల్చుకుంటూ
అడ్డంకులు దాటుకుని
మేఘాల నడుచుకుంటూ
మోహాల నింపుకుంటూ
వెలుగుతున్న  మెరుపుల్లా

అలవికాని మరణాల
గోడలను దాటుకుని
మిక్కుటంగా జననాల
తోరణాలు కట్టుకొని
హాయి హాయిగా సాగుతూ
అంతరాలు దాటుకుని జగన్నాథ రథచక్రాలై

అనుభవాల దొంతరలను
అణువణువున చుట్టు కొని
వర్తమాన చిగుళ్లను 
మదిని కౌగిలించుకుని
జయ జయ జయ నినాదాలు
జగమంతా వింటుండగా

ఆనందపు వరదలన్ని
ఆయువులు నింపంగా
మదిలోని ఆశలన్ని
సుమగంధాల పంచగా
జాడలు లేని రెక్కలతో
పయనించిన పరిమళాలు

కేకలతో స్వాగతాలు
కేకులతో సంబరాలు
బాణసంచామోతలు
నడి రాతిరి వేకువలు
మరుపుల జడివానతో
మారుతున్న చిత్తరువులు

అందరి హృదయాలలో
ఆనందం పెరగాలి
వానపూల సందడితో
నేల తీపి పంచాలి
శాంతి కాంతి ప్రతి మదిన
పదిలంగా నిలవాలి

అలై బలై ఆటలు
అల్లుకున్న ఆశలు
గుప్పు మని మనసున
కురిసిన జడివానలు
ఆనందపు సంద్రాలలో
మోగించిన కొత్త సిరుల జయభేరులు

రమేశ్ గోస్కుల
నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

0/Post a Comment/Comments