అమర మధుళిక

అమర మధుళిక

అమర మధుళిక

మళ్ళీ చిగురిస్తానా

రాలిపోయిన ఆశలను

వాలిపోయిన ఆశయాలను

ఎండిపోయిన భావాలను

తిరిగి ప్రోగుచేసుకొని

నాకలలు నిజం చేసుకోగలనా|

నా ఊపిరికి ఊతంఇచ్చే

నా శ్వాసకు ప్రాణం నింపే

నా ఆశయ కొమ్మలకు అంటుకట్టి

నా క్రొత్త బ్రతుకుకు

మార్గం వేసే ఆధారికను అందుకోగలనా|

పండిన బాధల బంధిఖానా వదిలి

నిండిన నిరాశా నిస్పృహలు వీడి

ఆనందాన్ని అల్లే

నా ఎదన ప్రశాంత హసంతం పూయించే

వసంత వనహారికను అందుకోగలనా|

కదిలిపోతున్న కాలాన్ని ఆపలేక

వీడిపోతున్న సహేతుక ఆశల అలలను వీడలేక

అరిషడ్వర్గాల భారాన్ని దించుకొన్నా

అనుభవించని

జీవితమనే మహా వృక్షాన్ని

మోడువారనీయక....

అందమైన లోకంలో

నాకై తపించే

నా అలౌకిక అమర మధుళికతో జీవించగలనా


రచన

డా|| బాలాజీ దీక్షితులు పి.వి
శ్వేత శిక్షణ సంస్థ 
తిరుపతి
8885391722 

0/Post a Comment/Comments