ఆణిముత్యాలు-గద్వాల సోమన్న

ఆణిముత్యాలు-గద్వాల సోమన్న

"ఆణిముత్యాలు"
(బాలగేయం)
---------------------------------
పిడికిలి బిగించాలి
గడిబిడి తరమాలి
నడవడి మారాలి
అలజడి పోవాలి

నగవులు విరియాలి
ముఖములు వెలగాలి
కలతలు కరగాలి
మనసులు పొంగాలి

తలపులు మెరియాలి
తనువులు మురియాలి
కలువల రేకుల్లా
బ్రతుకులు ఉండాలి

బుద్ధులు కడగాలి
శుద్ధిగా బ్రతకాలి
పెద్దల మాటలు విని
హద్దులో ఉండాలి
-గద్వాల సోమన్న 

0/Post a Comment/Comments