శీర్షిక: తికమక పాలనలో... పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: తికమక పాలనలో... పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక:తికమక పాలనలో...

ధర్మం పట్టుతప్పుతుంది
మత్తులో తూగుతూ ఊగుతూ
నేతలంతా చేవచచ్చి 
అటుఇటుగానోళ్ళయి
మౌనవ్రతంతో పాదక్రాంతులౌతూ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం దీస్తున్నరు
కపటవేషధారులంతా భజనమండలి భక్తులై
అన్యాయాన్ని న్యాయంగా చూపుతూ
లోకమేలుతున్నరు
మేలొక్కటైనా లేదిపుడు
మెలుకువ రాని చీకట్లోకి నెట్టేసి
సామాన్యుల బతుకుల్లో కనరాని కాంతినింపుతున్నరు
కారుచీకట్లు నిండుకున్నవి
చీకటి తరుముతామంటూ చెవుల్లో పూలెట్టుందుకొస్తున్నరు 
పూటగడిస్తేచాలు అన్ని గాలికొదిలేసి గోడమీద పిల్లులౌతున్నరు
నేటి నాయకగణం
గెలిపించే జనగనం  గమనించని గమనంలో పయనం సాగిస్తున్న దృశ్యం

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments