ఆణిముత్యాలు
-------------------------------------
మొక్క ఒకటి నాటితే
చక్కబడును జీవితాలు
అక్కరలో సాయపడితే
పెక్కు ఆశీర్వాదాలు
చిరునవ్వులు చిందితే
చిగురించును వదనాలు
ప్రేమ దివ్వె వెలిగితే
ప్రకాశించును సదనాలు
చెలిమి కాస్త పెరిగితే
గట్టిపడును బంధాలు
శ్రతృత్వం తరిగితే
కుదుటపడును కుటుంబాలు
కృతజ్ఞతలు చూపితే
పులకించును హృదయాలు
మానవత్వం చాటితే
వృద్ధినొందు లోకాలు
--గద్వాల సోమన్న
-------------------------------------
మొక్క ఒకటి నాటితే
చక్కబడును జీవితాలు
అక్కరలో సాయపడితే
పెక్కు ఆశీర్వాదాలు
చిరునవ్వులు చిందితే
చిగురించును వదనాలు
ప్రేమ దివ్వె వెలిగితే
ప్రకాశించును సదనాలు
చెలిమి కాస్త పెరిగితే
గట్టిపడును బంధాలు
శ్రతృత్వం తరిగితే
కుదుటపడును కుటుంబాలు
కృతజ్ఞతలు చూపితే
పులకించును హృదయాలు
మానవత్వం చాటితే
వృద్ధినొందు లోకాలు
--గద్వాల సోమన్న