శీర్షిక: కాలమా కాసేపాగిపో..!!

శీర్షిక: కాలమా కాసేపాగిపో..!!

శీర్షిక: కాలమా కాసేపాగిపో..!!

మానవత్వం మాయమౌతున్నది
మనిషి మస్తిష్కంలో

దానవత్వం
ముసుగేసుకుని
మనిషిగా పైపైమెరుగుల్లో

అన్యాయాన్ని
లోకముందుంచినా
మత్తులో చిందేసే మోసగాళ్ళు

ప్రయాణిస్తున్న
ఆక్రందనతో ఆర్తితో
మంచిరోజులొస్తాయేమోనని

న్యాయాన్యాయాలకి
నడుమ దూరం
నింగి నేలకున్నంత మరి

రాజకీయమేచోటైనా
అవినీతి పెరిగిన తరుణంలో
అవకాశాలు అందనిద్రాక్షే

హక్కులన్నొక్కొక్కటి
కళ్ళముందావిరవుతుంటే
ఫలితం కన్నీళ్లు

మాయమాటల మాయాజాలంలో
మోసపోవడమెపుడు ఆకలికేకలదే మరి

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments